హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Government Key Announcement: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 9 వేల మంది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులే..!

Telangana Government Key Announcement: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 9 వేల మంది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలక భాగంగా ఉన్న విలేజ్ రెవెన్యూ సహాయకులకు(VRA) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలక భాగంగా ఉన్న విలేజ్ రెవెన్యూ సహాయకులకు(VRA) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్(Telangana Government) చెప్పబోతోంది. వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా(Government Employees) గుర్తిస్తూ క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ తమ సిఫార్సుల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందచేసినట్లు తెలుస్తోంది. ఈ ఐఏఎస్(IAS) అధికారుల కమిటీకి శేషాద్రి నేతృత్వం వహించారు. వీరందరినీ సెప్టెంబర్ మొదటి వారంలోగా (September First Week) క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.


Work From Home To Office: వర్క్ ఫ్రం హోంకు శుభం కార్డు ప్రకటించిన ప్రముఖ ఐటీ దిగ్గజం.. దీని బాటలో మిగతా ఐటీలు..


దీనిపై ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన ట్రెసా రాష్ట్ర కార్యవర్గ నివేదికను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 21వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. పదో తరగతి, ఆపైన విద్యార్హత ఉన్న తొమ్మిది వేల మందికి మాత్రమే ఈ పదోన్నతులు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే వీఆర్ఏలను క్రమద్ధీకరిస్తామని చెప్పినా.. ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ వ్యవహారంపై కదలిక మొదలైంది. 33 జిల్లాల వారీగా సీసీఎల్ఏ ప్రాధమిక సమాచారాన్ని అంతా సేకరించింది.క్రమబద్ధీకరణ కారంగా వీఆర్ఏలకు పేస్కేలును చెల్లిస్తారు. కానీ.. వేతన వివరాలు మాత్రం ఖరారు కాలేదని రెవెన్యూ శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 23,046 మంది వీఆర్ఏలు ఉన్నారు. వీటిలో విధుల్లో ఉన్నవారు 21,433 మంది. పదో తరగతి చదివిన వారు 3,756 మంది ఉండగా.. ఇంటర్ చదివిన వారు 2,343 మంది, డిగ్రీ చదివిన వారు 1951 మంది, పీజీ పూర్తి చేసిన వారు 858 మంది ఉన్నారు.


TSLPRB Constable Exam: కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. పరీక్ష హాల్లో ఇలా ఉండండి..


తొమ్మిది వరకు చదివిన వారు 7,200మంది, విద్యార్హతలు లేని వారు 5,226 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో పదో తరగతిపైన చదివిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించనున్నారు. ఇందులో కూడా.. డైరెక్ట్ రక్య్రూట్ మెంట్ ద్వారా ఎంపికైన వారిని ధరణి ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించనున్నారు. కొంత మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించేందుకు ప్రభత్వం కార్యాలచరణ రూపొందిస్తోంది. తహసీల్దారు కార్యాలయాల్లో వీళ్లను ఎక్కువగా సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. డ్రైవర్లుగా, అటెండర్లుగా మరికొంతమందిని నియమించనున్నారు. ఎలాంటి విద్యార్హత లేని వారిని కూడా క్రమద్ధీకరించనున్నారు. వీరిలో కూడా 50 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ అవకాశం లేదా రూ.10 లక్షల వరకు ఇచ్చి ఉద్యోగ విరమణ చేసేలా అవకాశం కల్పించనున్నారు.


Easy To Get 60 Marks: 60 మార్కులు తెచ్చుకోవడం ఇంత సులువా.. కానిస్టేబుల్ కు ఈ ఒక్క స్ట్రాటజీ చాలు.. 60 మార్కులు వచ్చినట్లే..


జూనియర్ అధ్యాపకుల జాబితా..


వీటితో పాటే.. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లలో పని చేస్తున్న 2951 మంది కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జాబితా క్రమబద్ధీకరణ కోసం ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు. దీనిలో కూడా మొత్తం నాలుగు విభాగాలుగా విభజించారు. ఎలాంటి విద్యార్హత లేని వారు 37 మంది ఉన్నటట్లు గుర్తించారు. 111 మంది పదవి విరమణ వయస్సు మించిపోయిన వారుండా.. 325 మంది ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవిని వారుగా గుర్తించారు. ఈ మూడు సమస్యలు లేకుండా ఉన్న వారు 2478 మంది. వీరిని ముందుగా క్రబద్ధీకిరించే అవకాశం కనిపిస్తోంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana, Telangana government jobs, Vra

ఉత్తమ కథలు