తెలంగాణలో వరుసగా ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్లు(Notifications) వెలువడిని సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జోరు కొనసాగుతోంది. వరుస నోటిఫికేషన్లను రెండు మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం జారీ చేసింది. అందులో ముఖ్యంగా గ్రూప్ 1 పోస్టులతో పాటు.. పలు గ్రూప్ 4 పోస్టులకు, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు, మెడికల్ పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసింది ఏపీపీఎస్సీ(APPSC). కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయ్యాయి. అయితే చాలా కాలం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్లు కొంత నిరాశకు గురి చేశాయి. ఎందుకంటే.. నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం.
ఇదిలా ఉండగా.. నాన్-యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి గడువును మరో ఏడాది పెంచుతూ ఏపీ సర్కార్ సెప్టెంబరు 30న ఉత్తర్వులు జారీచేసింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని నిరాశ చెందిన నిరుద్యోగులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇప్పటికే 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచిన వయోపరిమితి గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. తాజా ఉత్తర్వులతో దీనిని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో మాత్రమే ఇది పని చేయనుండగా యూనిఫాం సర్వీసులు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలకు సంబందించిన నియామకానికి ఈ వయో పరిమితి వర్తించదు.
APPSC AMVI నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు 17 పోస్టుల కోసం APPSC AMVI నోటిఫికేషన్ 2022ని విడుదల చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసకోవచ్చు. AMVI దరఖాస్తు ఆన్‌లైన్ ప్రక్రియ 2వ నవంబర్ 2022 నుండి ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ 22 నవంబర్ 2022గా పేర్కొన్నారు.
మొత్తం పోస్టులు 17
క్యారీడ్ ఫార్వర్డ్ (CF) - 02
తాజా ఖాళీలు - 15
వయో పరిమితిదరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 జూలై 2022 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి.
జీతం.. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.31,460 – 84,970 మధ్య చెల్లించనున్నారు.
అర్హతలు..
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2.స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ లేదా టెక్నలాజికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డ్, హైదరాబాద్ జారీ చేసిన ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హత కలిగి ఉండాలి. మరియు
3.మోటారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి . 3 సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు మోటారు వాహనాలను నడపడంలో అనుభవం కలిగి ఉండాలి మరియు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: APPSC, Career and Courses, Group 1, JOBS