THE GOVERNMENT HAS DECIDED TO INCREASE THE MAXIMUM AGE LIMIT FOR DISABLED RESERVATIONS AND JOBS IN TSPSC BY ANOTHER TEN YEARS VB
TSPSC-CM KCR: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో వారి వయో పరిమితి, రిజర్వేషన్లు పెంపు..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
CM KCR: నిరుద్యోగ దివ్యాంగులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగుల రిజర్వేషన్లు, వయో పరిమితి పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి దివ్యాంగ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
తెలంగాణలో ఉద్యోగా భర్తీ వేగంగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా చేపట్టనున్న ఉద్యోగ నియామకాలపై విధివిధానాల రూపకల్పనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు కూడా జారీ కానున్నాయి. అంతే కాకుండా నిరుద్యోగ దివ్యాంగులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల్లో వారి రిజర్వేషన్లు, గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
అంతే కాకుండా వాళ్లు చెల్లించాల్సిన ఫీజు నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది. దీనికి సంబంధించి దివ్యాంగ సమక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో చేపట్టే 80 వేల ఉద్యోగాల భర్తీలో వేగం మొదలైందని.. ఇక భర్తీ చేపట్టే ప్రక్రియకు ఏ మాత్రం ఆటంకం ఉండబోదనే ఆశతో నిరుద్యోగులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కేబినెట్ త్వరలో సమావేశం కానుంది. నవంబర్ 14న మంత్రివర్గ సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ దీనికి అధ్యక్ష్త వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, నెలలోపు పంటల సాగుపై అవగాహన కల్పించడంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 80 వేల జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది. ఎప్పటిలోగా ఉద్యోగాలను భర్తీ చేయాలనేది కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారు. భర్తీ ప్రక్రియలో వేగం పెంచాలని ఇటీవల కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఉద్యోగ నియామకాలపై విధివిధానాల రూపకల్పనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. జోనల్ విధానంలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం నియామక ప్రక్రియ ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.