Home /News /jobs /

THE DEADLINE IS ONLY A WEEK AWAY HAVE YOU APPLIED FOR THESE JOBS BUT DO THIS IMMEDIATELY UMG GH

Job Alert: ఇక వారం రోజులు మాత్రమే గడువు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.. చేయకపోతే వెంటనే ఇలా చేయండి !

  ఇక వారం రోజులు మాత్రమే గడువు.. ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.. అయితే వెంటనే ఇలా చేయండి !

ఇక వారం రోజులు మాత్రమే గడువు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.. అయితే వెంటనే ఇలా చేయండి !

ప్రభుత్వ ఉద్యోగాల(JOBS) కోసం ఎదురుచూస్తూ, పోటీ పరీక్షలకు ప్రిపేర్(prepare) అవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పలు సంస్థలు వివిధ హోదాల్లో నియామక ప్రక్రియను చేపట్టాయి. ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ ఉద్యోగాల(Jobs) కోసం ఎదురుచూస్తూ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పలు సంస్థలు వివిధ హోదాల్లో నియామక ప్రక్రియను చేపట్టాయి. ఉద్యోగాన్ని బట్టి అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఏవో చూద్దాం.

అసిస్టెంట్ మేనేజర్, నాబార్డ్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD), అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను ఓపెన్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 170 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,600 వరకు జీతం అందనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 7లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

డీఆర్‌డీవో, డీఎస్‌టీ, ఏడీఏ రిక్రూట్‌మెంట్
భారత ఆర్మీకి చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC).. డీఆర్‌డీవో, డీఎస్‌టీ, ఏడీఏల్లో సైంటిస్ట్-బీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 630 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను గేట్ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆపై ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను జులై 29లోగా సమర్పించాలి.

ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ(Army) ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మాండరిన్ భాషా వ్యాఖ్యాతల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఆరు ఖాళీల్లో సివిల్ అభ్యర్థులకు ఐదు పోస్టులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అధికారి ద్వారా ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆర్మీ పేర్కొన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌‌ను ఫుల్‌ఫిల్ చేసి ఉండాలి. ఆర్మీ వెబ్‌సైట్‌లో ఉన్న అడ్రస్‌కు దరఖాస్తులను ఇండియా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 10గా నిర్ణయించారు.

ఇదీ చదవండి: Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!



వివిధ వర్సిటీల్లో JRF, LS, AP పోస్టుల భర్తీ
దేశంలోని వివిధ యూనివర్సిటీలు(universities), కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ (LS), అసిస్టెంట్ ప్రొఫెసర్‌(AP) పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందు కోసం ఎన్‌టీఏ జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ (CSIR-UGC NET) పరీక్షను నిర్వహించనుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫీజు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10గా నిర్ణయించారు.



నేషనల్ హెల్త్ మిషన్, యూపీ
ఉత్తర‌ప్రదేశ్‌లో కాంట్రాక్ట్ విధానంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నేషనల్ హెల్త్ మిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తంగా 5,505 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,500 వరకు జీతం ఇవ్వనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: DRDO, Indian Army, JOBS, NABARD

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు