సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(Teacher Eligibility Test) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య సూచన. దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు పొరపాటు చేసినవారు దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫారమ్‌లో మార్పులు చేయడానికి డిసెంబర్ 3 వరకు సమయం ఇచ్చింది. అంటే ఈ అవకాశం రేపటితో ముగియనుంది. CBSE ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 31 అక్టోబర్ 2022న ప్రారంభించింది. ఇది 24 నవంబర్ 2022 వరకు కొనసాగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్-2023 షెడ్యూల్ విడుదల.. ప్రధాన పరీక్షల తేదీలు ఇవే..
ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ మోడ్ (CBT)లో నిర్వహించబడుతుంది. అభ్యర్థుల అడ్మిట్ కార్డు ద్వారా పరీక్ష తేదీ గురించి పూర్తి సమాచారం తెలసుకోవచ్చు. CTET అనేది ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించబడే అర్హత పరీక్ష. CTET పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. CTET పేపర్లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.
ఎడిట్ చేసుకోండిలా..
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
-దీని తర్వాత, హోమ్‌పేజీలో “CTET Dec-2022 కోసం దరఖాస్తు చేసుకోండి” అనే లింక్ పై క్లిక్ చేయండి.
-దానిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ మరియు పిన్ వంటి వివరాలతో లాగిన్ చేసి “సమర్పించు” బటన్‌పై క్లిక్ చేయవచ్చు.
-దీని తర్వాత "CTET అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.
-దీనిలో ఏమైనా తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకొని సమర్పించు బటన్‌పై క్లిక్ చేయాలి.
-చివరగా, అభ్యర్థి ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి.. దాని ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపుడుతుంది.
సర్టిఫికేట్ వ్యాలిడిటీ
సీ-టెట్ ఎగ్జామ్‌ను ఒకసారి క్లియర్ చేస్తే, అభ్యర్థులు తమ జీవితంలో ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటుకానుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. సగటున 50% మంది అభ్యర్థులు సీ-టెట్‌లో అర్హత సాధిస్తారు. కాగా, గతంలో సర్టిఫికేట్ ఏడేళ్ల కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. ఆ తరువాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చేది. ఎగ్జామ్ క్లియర్ చేసినవారు.. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS), ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB), ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(ERDO) లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Ctet, Degree jobs, JOBS, Students