తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొత్తం 6 నోటిఫికేషన్లకు సంబంధించి హైకోర్టు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో మొత్తం నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కాగా.. జనవరి 31న ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. అంటే రేపటితో ఈ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తుల స్వకీకరణ ముగుస్తుంది. పోస్టుల వివరాల్లోకి వెళ్తే..
నాన్ టెక్నికల్ పోస్టులు..
1. జూనియర్ అసిస్టెంట్
2. ఫీల్డ్ అసిస్టెంట్
3.ఎగ్జామినర్
4. రికార్డ్ అసిస్టెంట్
5. ప్రాసెస్ సర్వర్
6. ఆఫీస్ సబార్డినేట్
1.జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. మొత్తం 271 పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.
2.ఫీల్డ్ అసిస్టెంట్
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 76 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.ఎగ్జామినర్
ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మొత్తం 63 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.రికార్డ్ అసిస్టెంట్
రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
5.ప్రాసెస్ సర్వర్
ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి మొత్తం 163 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
6.ఆఫీస్ సబార్డినేట్
ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని తెలంగాణలోని వివిధ జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు.
దరఖాస్తు ఫీజు..
ఈ 6 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్ కు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు ప్రారంభ తేదీ- జనవరి 11, 2023
దరఖాస్తులకు చివరి తేదీ- జనవరి 31, 2023
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ తేదీ- ఫిబ్రవరి 15, 2023
పరీక్ష తేదీ - మార్చి 2023
మొత్తం 1900లకు పైగా వెల్లడైన ఈ పోస్టులు మొత్తం జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. దరఖాస్తు సమర్పించడానికి డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Court jobs, High Court, JOBS