హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Results Will Be Released: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఆ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

Results Will Be Released: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఆ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

Results Will Be Released: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఆ ఫలితాలు విడుదల..

Results Will Be Released: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఆ ఫలితాలు విడుదల..

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ICSE 10వ తరగతి ఫలితాలను రేపు( జూలై 17న ) ప్రకటించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ICSE 10వ తరగతి ఫలితాలను రేపు( జూలై 17న ) ప్రకటించనున్నారు. ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.cisce.org ద్వారా చూసుకోవచ్చని పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్ కాకుండా.. విద్యార్థులు తమ ICSE 10వ తరగతి ఫలితాలను డిజిలాకర్(Digi locker) యాప్ లేదా SMS ద్వారా కూడా చూసుకోవచ్చని తెలిపింది. దీనితో పాటు.. విద్యార్థులు తమ ఏడు అంకెల యూనిక్ ఐడీని 09248082883కు మెసేజ్(Message) చేయడం ద్వారా కూడా తమ ఫలితాలను పొందవచ్చు.

Apple Offers RS.16 Crores: హ్యాకర్లకు సవాల్ విసిరిన యాపిల్.. ఇలా చేస్తే రూ.16 కోట్లు సొంతం చేసుకోవచ్చు..


ఫలితాన్ని ఎలా చూసుకోవచ్చు..

Step 1 : cisce.org అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2 : హోమ్‌పేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : ఆ తర్వాత ICSE లేదా ISC కోర్సును ఎంచుకోండి.

Step 4 : మీ UID, ఇండెక్స్ నంబర్ మరియు క్యాప్చా నమోదు చేయండి.

Step 5 : మీ ఫలితం స్క్రీన్‌పై వస్తుంది.

Step 6 : భవిష్యత్ అవసరాల కొరకు దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

కోవిడ్ కారణంగా.. ఈసారి 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షలను కౌన్సిల్ రెండు సెమిస్టర్లలో నిర్వహించింది. మొదటి టర్మ్ పరీక్ష నవంబర్ నుండి డిసెంబర్ 2021 వరకు జరిగింది. 10వ తరగతి సెమిస్టర్-2 పరీక్షను ఏప్రిల్ 25 నుండి మే 23, 2022 వరకు నిర్వహించింది. మొదటి సెమిస్టర్ ఫలితాలు ముందుగానే ప్రకటించబడ్డాయి.  ఇంటర్నల్ మరియు ప్రాక్టికల్ అసెస్‌మెంట్ మార్కులతో పాటు రెండు సెమిస్టర్‌ల మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదల చేయబడతాయి. ఏదైనా సెమిస్టర్‌లో హాజరుకాని లేదా రెండింటిలో గైర్హాజరైన విద్యార్థుల ఫలితాలు ప్రకటించబడవు.

Teenage Girls: టీనేజ్ అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటో తెలుసా..? ఆ సమయంలో ఇలా..


10వ తరగతి ఫలితాల్లో ఎవరికైనా  తమ మార్కుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లైతే ఆ విద్యార్థులు రీ వాల్యూవేషన్ కోరకు ఒక్కో సబ్జెక్టు కౌన్సిల్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  దీని కోసం.. కౌన్సిల్ కెరీర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఇది జూలై 17, సాయంత్రం 5 గంటల నుండి జూలై 23 వరకు చేయవచ్చు.

గత సంవత్సరం.. ICSE విద్యార్థులకు వారి 9 తరగతుల ఫైనల్స్ మరియు 10వ తరగతి ఫ్రీ ఫైనల్(Pre Boards) అండ్ ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులందరూ ఐసిఎస్‌ఇలో ఉత్తీర్ణత సాధించారు.. అంటే 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

First published:

Tags: 10th class results, Career and Courses, CBSE, Degree students, JOBS, Students

ఉత్తమ కథలు