తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ(Finance Minister) నుంచి అనుమతి లభించగా.. టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు(Notifications) కూడా విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2(Group 2), గ్రూప్ 3(Group 3) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్(Notification) కూడా ఈ నెల ఆఖరి వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పంచాయతీరాజ్ శాఖలో(Panchayat Raj Department) కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు(Hanumanth Rao) ఆదేశాలు జారీ చేశారు.
పోస్టు పేరు | ఖాళీ సంఖ్య |
జూనియర్ అసిస్టెంట్ | 253 |
సీనియర్ అసిస్టెంట్ | 173 |
సూపరింటెండెంట్ | 103 |
ఈ జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 4 కింద నోటిఫై చేసిన 9వేల పైచిలుకు పోస్టుల్లో వీఆర్ఓల భర్తీ కారణంగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటి స్థానాల్లో ఈ కొత్త పోస్టులను ప్రభుత్వానికి చూపించనున్నట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
FBO-FRO-FSO Posts: అటవీ శాఖలోఉద్యోగాలు .. 1665 ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీపై కీలక అప్డేట్..
ఇదిలా ఉండగా.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 175 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 13ని ఆఖరి తేదీగా నిర్ణయించింది టీఎస్పీఎస్సీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ తెలిపే డిటైల్డ్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana government jobs