అందరికీ నాణ్యమైన విద్య (Education)ను పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET) తీసుకొచ్చింది. ఈ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET UG) 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.
యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ట్వీట్ చేస్తూ.. సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ మార్చి 20 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటలకు కొనసాగుతుందని తెలియజేశారు. కానీ పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. CUET PG 2023 పరీక్ష జూన్ 1 నుండి జూన్ 10, 2023 వరకు నిర్వహించబడుతుందని గతంలో UGC చైర్మన్ ప్రకటించారు. దీని ఫలితాలు జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం.. సీయూఈటీ యజీ 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 42 విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.
సిలబస్ ఏంటి..
సీయూఈటీ యజీ 2023 సిలబస్ పూర్తిగా 12వ తరగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో నుంచే ప్రవేశ పరీక్షలో ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. 11వ తరగతి సిలబస్ నుంచి ఒక్క ప్రశ్నను కూడా ఎగ్జామ్‌లో అడిగేందుకు ఆస్కారముండదు. అందుబాటులో ఉన్న 13భాషల్లో అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్ పరీక్షలలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Announcement on CUET-PG: NTA will conduct Common University Entrance Test (CUET-PG) for admission into Postgraduate Programmes in Central and other participating Universities / Institutions / Organizations / Autonomous Colleges.
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 20, 2023
Candidates may apply online at https://t.co/HFg2hA0YAO starting tonight during the period from 20.03.2023 to 19.04.2023 and also pay the applicable fee, online, through the payment gateway using Debit/Credit Cards, Net Banking, UPI. pic.twitter.com/5ZUNR6z7Sh
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 20, 2023
పరీక్షా విధానం..
సీయూఈటీ యూజీ 2023 ప్రవేశ పరీక్షలో నాలుగు సెక్షన్‌లు ఉండనున్నాయి. Section IA- 13 లాంగ్వేజెస్, Section IB 20 లాంగ్వేజెస్, Section II- 27 డొమైన్ స్పెసిఫిక్ టాపిక్స్, Section III- జనరల్ టెస్ట్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2023, JOBS