హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Central Government: కొత్త పెన్ష‌న‌ర్ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ ప‌రిశీల‌న‌లో జాప్యానికి చెక్ పెట్టే ఆదేశాలు ఇచ్చింది. ఈమేర‌కు ఎల‌క్ట్రానిక్ పేమెంట్ ఆర్డ‌ర్స్ (ఈపీఓ)ను ప్రామాణికంగా తీసుకోమంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త పెన్ష‌న‌ర్ల‌కు భారీ ఊర‌ట‌నిచ్చిన‌ట్ట‌యింది.

ఇంకా చదవండి ...

కొత్త పెన్ష‌న‌ర్ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ ప‌రిశీల‌న‌లో జాప్యానికి చెక్ పెట్టే ఆదేశాలు ఇచ్చింది. ఈమేర‌కు ఎల‌క్ట్రానిక్ పేమెంట్ ఆర్డ‌ర్స్ (ఈపీఓ)ను ప్రామాణికంగా తీసుకోమంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త పెన్ష‌న‌ర్ల‌కు భారీ ఊర‌ట‌నిచ్చిన‌ట్ట‌యింది. ఇక‌పై పింఛ‌న్ పేమెంట్ ఆర్డ‌ర్స్ (పీపీఓ)కోసం కాళ్ళు అరిగేలా తిరిగే బాధ త‌ప్ప‌నుంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన త‌రువాత త‌మ తొలి పెన్ష‌న్ అందుకోవ‌డానికి అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. పెన్ష‌న్ పొంద‌డానికి పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ త‌ప్ప‌నిస‌రి. ఈ ఆర్డ‌ర్ ఇప్ప‌టిదాకా రెండు రూపాల‌లో బ్యాంకుల‌కు అందుతోంది. ఒక‌టి డిజిట‌ల్ ఫార్మాట్‌లో ఈ-పీపీఓగా అందుతోంది. మ‌రొక‌టి ఫిజిక‌ల్ పీపీఓ. ఇది ధ్రువ‌ప్ర‌తం రూపంలో అందుతుంది. ఈ రెండింటిని స‌రిచూసుకుని త‌రువాత పెన్ష‌న్ చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా తీవ్ర‌మైన జాప్యంతో జ‌రుగుతోంది. పెన్ష‌న్ చెల్లింపుల విష‌య‌మై కేంద్రీకృత పెన్ష‌న్ చెల్లింపుల కేంద్రం (సీపీపీసీ) బ్యాంకుల‌కు నిర్ణీత ఆదేశాలు ఇస్తుంటుంది.  ఈ నేప‌థ్యంలో పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై తొలిసారి పింఛ‌న్ చెల్లింపుల‌కు ఈ-పీపీఓను ప్రామాణికంగా తీసుకోవాలని మోమో జారీ చేసింది.

త‌ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా పెన్ష‌న్ చెల్లించాల‌ని ఆదేశించింది. ధ్రువ‌ప్ర‌తాల ప‌రిశీల‌న‌లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ ఒక దారిలోకి తేవాల‌నే లక్ష్యంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. సెంట్ర‌ల్ పెన్ష‌న్ అకౌంటింగ్ ఆఫీసు (సీపీఏఓ) జారీచేసే ఎల‌క్ట్రానిక్ పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్స్ (ఈ-పీపీఓలు), ఎల‌క్ట్రానిక్ స్పెష‌ల్‌సీల్‌ అథారిటీ (ఈ-ఎస్ఎస్ఏ)ల‌ను ఆమోదిస్తే చాల‌ని స్ప‌ష్టం చేసింది. వీటి ఆధారంగా చెల్లింపులు త‌క్ష‌ణ‌మే జ‌ర‌పాల‌ని ఆ మెమోలో ఆదేశించింది. అయితే త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు ఫిజిక‌ల్ పీపీఓ బుక్‌లెట్ సంబంధిత స‌మాచారాన్ని కేంద్రీకృత‌ పెన్ష‌న్ చెల్లింపుల కేంద్రానికి (సీపీపీసీ) పంపాల‌ని కోరింది.

డిజిట‌ల్ ఫామ్‌లోని ధ్రువ‌ప్ర‌తాలు, మామూలు ధ్రువ‌ప్ర‌తాల‌కు ఏమైనా తేడా ఉంటే.. ఆ విష‌యాన్ని సెంట్ర‌ల్ పెన్ష‌న్ అకౌంటింగ్ ఆఫీస్‌కు తెలియ‌జేయాల‌ని మెమోలో కోరింది. దీనివ‌ల్ల ఇకపై రిటైర్ కాబోయే వారు, ఇప్ప‌టికే రిటైర్ అయి తొలి పెన్ష‌న్ కోసం ఎదురుచూస్తున్న‌వారు ఎంతో ఊర‌ట పొంద‌నున్నారు. డిజిట‌ల్ పెన్ష‌న్‌ పేమెంట్ ఆర్డ‌ర్ ఆధారంగా చెల్లింపులు చేయ‌మ‌ని బ్యాంక‌ర్ల‌ను పెన్ష‌న‌ర్లు కోర‌వ‌చ్చు. కుటుంబ పింఛ‌న్ పొందేవారికి కూడా ఇది ఎంతో ఊర‌టనిచ్చే అంశ‌మే.

Published by:Veera Babu
First published:

Tags: Central governmennt, Payments, Pensioners

ఉత్తమ కథలు