స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ sbi.co.in సందర్శించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు(Application) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియ నేటి నుంచి అంటే.. నవంబర్ 22, 2022 నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 12, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్‌లో వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న 09 మేనేజర్ పోస్టులు, 55 క్రెడిట్ అనలిస్ట్ మేనేజర్ పోస్టులు, ఒక సర్కిల్ అడ్వైసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లకు(Notifications) సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఖాళీలు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
మేనేజర్ పోస్టులు నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్స్-డిజిటల్ పేమెంట్స్, ప్రొడక్ట్స్ - డిజిటల్ పేమెంట్స్ / కార్డ్స్, ప్రొడక్ట్స్ - డిజిటన్ ప్లాట్ ఫామ్స్ వంటి విభాగంలో మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు.
State Bank of India is recruiting Special Cadre Officers on a regular basis with impressive professional knowledge of digital platforms and products. To apply, visit: https://t.co/TquwQ1JeG0#JoinSBIFamily #SBI #StateBankofIndia #AzadiKaAmritMahotsavWithSBI #AmritMahotsav pic.twitter.com/Ct01WkQxYM
— State Bank of India (@TheOfficialSBI) November 22, 2022
విద్యార్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల యొక్క వయస్సు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1 : అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఇప్పుడు హోం పేజీలో కనిపిస్తున్న లేటెస్ట్ అనౌన్స్ మెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3 : దీనిలో స్కోల్ అవుతున్న రెండో ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4 : అక్కడ ఇచ్చిన సూచనలు చదివి.. మీ యొక్క అర్హతను నిర్ధారించుకొని.. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Step 5 : చివరగా.. వెబ్ సైట్ టాప్ లో కనిపిస్తున్న జాయిన్ ఎస్బీఐ ఆప్షన్ ను ఎంచుకొని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం డైరెక్ట్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
క్రెడిట్ అనలిస్ట్ మేనేజర్ పోస్టులు..
దీంతో పాటు మరో నోటిఫికేషన్ ను ఎస్బీఐ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విభాగంలో మొత్తం 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు తప్పనిసరిగా 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ లేదా MBA (ఫైనాన్స్) / PGDBA / PGDBM / MMS (ఫైనాన్స్) / CA / CFA / ICWA పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
వీటికి దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు SBI వెబ్సైట్ https://bank.sbi/careersలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను నమోదు చేసుకోవాలి. దాని కోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు సంబంధించి పీడీఎఫ్ ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
సర్కిల్ అడ్వైజర్ పోస్టులు..
ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక సర్కిల్ అనలైజర్ పోస్టును భర్తీ చేయనున్నారు. అభ్యర్థి యొక్క వయస్సు 62 ఏళ్లకు మించకూడదు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, Banking news, JOBS, Jobs in sbi, Sbi jobs