Home /News /jobs /

THE APPLICATION PROCESS FOR VARIOUS POSTS IN FOOD CORPORATION OF INDIA AND SCIL IS ENDING ON AUGUST 16 KNOW DETAILS VB

FCI And SCIL Jobs: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..! రేపటితో ముగుస్తున్న గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FCI And SCIL Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ రెండు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలిలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SCIL)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అంటే దీనిలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 16 ఆగస్టు 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 16 జూలై 2022వ తేదీన ప్రారంభం అయింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SCIL అధికారిక వెబ్‌సైట్ shipindia.com సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 46 పోస్టులను భర్తీ చేస్తారు.

​​SCIL Recruitment 2022: షిప్పింగ్ కార్పొరేషన్ లో ఖాళీలు.. బీటెక్, డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు..


ఇందులో ఖాళీలు ఇలా..
మేనేజ్ మెంట్: 17 పోస్టులు
ఫైనాన్స్: 10 పోస్టులు
HR: 10 పోస్ట్‌లు
లా: 5 పోస్టులు
ఫైర్ & సెక్యూరిటీ: 2 పోస్టులు
సివిల్ ఇంజనీరింగ్: 1 పోస్ట్
CS: 1 పోస్ట్

ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ముంబై (థానే మరియు నవీ ముంబైతో సహా), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, గౌహతి మరియు ఢిల్లీ & NCRలలో నిర్వహించబడుతుంది.



దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 100 చెల్లించాలి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) రీ-ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీని కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం లేదు. అభ్యర్థులు రేపటి వరకు అంటే ఆగస్టు 16 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు fci.gov.in అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి.

ఇది కాకుండా.. పే లెవెల్ 13 వద్ద కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వం / PSU నుండి పదవీ విరమణ చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 61 ఏళ్లు మించకూడదు. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూ బోర్డు ముందు ఇంటర్వ్యూకి పిలుస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్, పదవీ విరమణ ఆర్డర్ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్ల యొక్క ధృవీకృత కాపీలతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లో తమ దరఖాస్తును ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 16-20, బరాఖంబ లేన్, న్యూఢిల్లీ-110001కి సమర్పించవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2022. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Fci, JOBS, Shipping

తదుపరి వార్తలు