ప్రస్తుతం సెంట్రల్, స్టేట్(State) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో మాత్రం వరుస నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. డిసెంబర్ 31 వరకు టీఎస్పీఎస్సీ నుంచి దాదాపు 25కు పైగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీంతో దీంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. లైబ్రరీలో కుర్చీలు ఖాళీగా ఉండట్లే. ప్రతీ జిల్లాల్లో స్టడీ హాళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీంతో పాటు.. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. జనవరి 20 నుంచి మున్సిపల్ శాఖలో అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. రేపటి నుంచి ఇంటర్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రరీ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటిని భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలి.
పోస్టుల వివరాలిలా..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యాశాఖలో 40, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 31 పోస్టులను భర్తీ చేస్తారు.
వేతనం..
ఇంటర్ విద్యాశాఖలోని లైబ్రరీలకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు చెల్లించనున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ కు నెలకు రూ.56,100 నుంచి రూ.1, 33, 630 వరకు చెల్లించనున్నారు.
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అర్హతలు..
-ఇంటర్ విద్యాశాఖలోని లైబ్రరీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. లైబ్రరీలో పీజీ పూర్తి చేసి ఉండాలి.
-టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని లైబ్రరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థులు లైబ్రరీలో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. యూజీసీ నెట్ లేదా స్టేట్ సెట్ లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం..
Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది లైబ్రేరియన్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
Step 3 : ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కువెళ్తుంది.
Step 4 : ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. అర్హతకు సంబంధించి వివరాలను నింపాలి.
Step 5 : చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. చివరకు సబ్ మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, TSPSC, Tspsc jobs