మెడికల్(Medical), డెంటల్(Dental), నర్సింగ్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) కోర్సుల ప్రవేశానికి అర్హత పరీక్షగా నీట్(NEET) నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏటా దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు(Students) నీట్‌కు హాజరవుతుంటారు. జూలై 17న జరిగే నీట్ (NEET) పరీక్ష కోసం దరఖాస్తు(Application) ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. దీంతో తదుపరి ప్రక్రియ ఇలా ఉండనుంది.
* అప్లికేషన్ కరెక్షన్
నీట్ అప్లికేషన్ సమర్పించిన తరువాత జరిగే ప్రక్రియే అప్లికేషన్ కరెక్షన్. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా మార్పులు చేయడానికి అనుమతిస్తారు. ఈ ఏడాది నీట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలోనే ఏన్‌టీఏ అనేక భద్రతా ప్రమాణాలను కల్పించింది. దీంతో నీట్, JEE మెయిన్ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయడానికి ముందుగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అయితే తాజా NTA ఎడిట్ సౌకర్యాన్ని కల్పించింది. అయితే దీనికి తేదీ నుంచి అనుమతి ఇవ్వాలన్న దానిపై షెడ్యూల్ ప్రకటించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్ వెలువడే అవకాశం ఉంది.
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 72,000 పోస్టుల్ని తొలగించిన భారతీయ రైల్వే
* అడ్మిట్ కార్డ్
నీట్ దరఖాస్తు ఫారమ్‌లను ఖరారు చేసిన తరువాత అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు. పరీక్షకు కనీసం 10 నుంచి 15 రోజుల ముందు నుంచే సంస్థ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలంటే అభ్యర్థుల వద్ద కచ్చితంగా అడ్మిట్ కార్డు ఉండాలి. ఈ ఏడాది విదేశాల్లో సైతం పరీక్షా కేంద్రాలను ఏన్‌టీఏ ఏర్పాటు చేస్తోంది. విదేశీ పౌరులు, ప్రవాస భారతీయులు నీట్ పరీక్ష రాయడానికి ఈసారి ఎన్‌టీఏ అనుమతించింది. వీరి కోసం దేశం వెలుపల దాదాపు 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
* నీట్ వాయిదాకు అవకాశం ఉందా?
నీట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసి ఆగస్టులో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో దరఖాస్తు గడువును ఎన్‌టీఏ రెండుసార్లు వాయిదా వేసింది. అయితే, ప్రస్తుతానికి నీట్ వాయిదాకు సంబంధించి ఎన్‌టీఏ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోపక్క CUETతో సహా అనేక ఇతర పరీక్షలతో NEET క్లాష్ అవుతుందని, దీంతో సన్నద్ధం కావడానికి సమయం చాలా తక్కువగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు.
* నీట్‌లో మార్పులు
ఈ ఏడాది నీట్ పరీక్ష కు సంబంధించి గరిష్ట వయోపరిమితిని రద్దు చేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ మెయిన్ సబ్‌జెక్టులుగా 12వ తరగతి క్లియర్ చేసిన ఎవరైనా నీట్ పరీక్ష రాయవచ్చు. దీంతో పోటీ మరింత పెరగనుంది. ఈసారి పరీక్ష వ్యవధిని కూడా పెంచారు. నీట్‌కు అదనంగా మరో20 నిమిషాలు కేటాయించనున్నారు. దీంతో మొత్తం పరీక్షకు మూడు గంటల 20 నిమిషాల సమయం ఉంటుంది. ఈ సడలింపు “గేమ్-ఛేంజర్” గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, NEET, NEET 2022, Windows