హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టులకు కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు..

TSPSC Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టులకు కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల దరఖాస్తుల ప్రక్రియ ముగిశాయి. ఇంకొ 6 నోటిఫికేషన్లకు సంబంధించి ఈ ప్రక్రియ కొనగుతోంది. నేడు అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగియనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో 78 ఖాళీల కోసం జూనియర్ & సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను 31 డిసెంబర్ 2022న విడుదల చేసిన విషయం తెలిసిందే.  TSPSC Jr & Sr అకౌంట్స్ ఆఫీసర్ ఆన్‌లైన్ అప్లికేషన్ 20 జనవరి 2023 నుండి 11 ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతుంది. నేడు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. అంటే మరి కొన్ని గంటలే దరఖాస్తులకు సమయం ఉంది.  ఇదిలా ఉండగా..  TSPSC Jr & Sr అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆగస్టు-2023 నెలలో నిర్వహించబడుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) లేదా ఆఫ్‌లైన్ OMR ద్వారా పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో అకౌంట్స్ ఆఫీసర్ 01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 13, సీనియర్ అకౌంటెంట్ 64 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.45,960 నుంచి రూ.96,890 మధ్య చెల్లించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాలి.

అర్హతలు..

అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Software Jobs: సాఫ్ట్ వేర్ కొలువు.. రూ.12లక్షల ప్యాకేజ్.. ఇలా సాధ్యం..

దరఖాస్తు విధానం..

Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2 : ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది అకౌంట్స్ ఆఫీసర్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

Step 3 : ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కువెళ్తుంది.

Step 4 : ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. అర్హతకు సంబంధించి వివరాలను నింపాలి.

Step 5 : చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. చివరకు సబ్ మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

First published:

Tags: JOBS, Telangana government jobs, TSPSC, Tspsc application fee, Tspsc jobs

ఉత్తమ కథలు