మునుపెన్నడూ లేని విధంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు(Group 4 Jobs) భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మొదటి సారి 8వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి కూడా అదే విధంగా స్పందన లభిస్తోంది. తెలంగాణలో 8039 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ను డిసెంబర్ 30 నుంచి ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Service Commission). భారీగా ఉద్యోగాలు ఉండడంతో ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. జనవరి 29 వరకు దరఖాస్తుల సంఖ్య 7.50 లక్షలు దాటినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తులకు ఈ నెల 30ని ఆఖరి తేదీ. అంటే రేపటితో ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అయితే.. గడువు నాటికి దరఖాస్తుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం 10 లక్షల సంఖ్య అయినా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా.. ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కలను పరిశీలిస్తే గ్రూప్-4 కు ప్రతీ రోజు సగటున 30 వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గ్రూప్ 4 కు దరఖాస్తు చేయాలంటే.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అయితే తాజాగా టీఎస్పీఎస్సీ మరో వెబ్ నోట్ విడుదల చేసింది. దీనిలో మరో 141 పోస్టులను ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో కలుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య 8180కు చేరాయి. రేపటితో ముగియాల్సిన దరఖాస్తుల గడువు కూడా పెంచే అవకాశం ఉంది. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ 2,391 ఉద్యోగాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు.. నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 10 ప్రిన్సిపాల్,30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ , 33 ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, 480 డిగ్రీ లెక్చరర్లు,324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 పీఈటీ పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు విధానం..
Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఇక్కడ అప్లికేషన్ ఫర్ గ్రూఫ్ 4 అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
Step 3 : ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కువెళ్తుంది.
Step 4 : ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. అర్హతకు సంబంధించి వివరాలను నింపాలి.
Step 5 : చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. చివరకు సబ్ మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, TSPSC, Tspsc jobs