హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC 7 Notifications: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ముగిసే 7 నోటిఫికేషన్స్ ఇవే..

TSPSC 7 Notifications: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ముగిసే 7 నోటిఫికేషన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC 7 Notifications: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన నోటిఫికేషన్లుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చాలా వరకు జనవరి నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే వీటి దరఖాస్తుల ముగింపు ప్రక్రియ ఫిబ్రవరిలో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన నోటిఫికేషన్లుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చాలా వరకు జనవరి నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే వీటి దరఖాస్తుల ముగింపు ప్రక్రియ ఫిబ్రవరిలో(February) ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ కు(Notification) సంబంధించి దరఖాస్తులు(Applications) ఏ తేదీన ముగుస్తున్నాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం..

1. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్

అందులో ముఖ్యంగా.. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. దీనికి దరఖాస్తుల స్వీకరణ జనవరి 12, 2023 నుంచి మొదలైంది. ముగింపు తేదీ ఫిబ్రవరి 01, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 06, 2023 ప్రారంభం అయింది. వీటి దరఖాస్తుల ప్రక్రియ ముగింపు తేదీ ఫిబ్రవరి 03, 2023గా ఉంది.

3. గ్రూప్ 4 ఉద్యోగాలు ..

గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ జనవరి 30నే ముగియాల్సి ఉండగా..దీనిని మరో 5 రోజులు పొడిగిస్తూ.. ఫిబ్రవరి 03న చివరి తేదీగా పేర్కొన్నారు. ఇప్పటికే 8లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి దరఖాస్తులు 10 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు డిసెంబర్ 30, 2022 నుంచి మొదలయ్యాయి.

4. లైబ్రేరియన్ ఉద్యోగాలు..

ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటి దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

5. అకౌంట్స్ ఆఫీసర్

అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కాగా.. వీటికి దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2023న ముగియనున్నాయి.

6. గ్రూప్ 2 ఉద్యోగాలు..

గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18, 2023 నుంచి ప్రారంభం అయింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ ముగింపు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2023 వరకు ఉంటుంది.

7. గ్రూప్ 3 పోస్టులు

గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ జనవరి 24న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 23, 2023 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.

TSPSC Group 4 Applications: TSPSC బోర్డు అత్యవసర భేటీ.. గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగింపు..

మరికొన్ని నోటిఫికేషన్లకు..

ఇక జనవరి 31, 2023న ముగియనున్న నోటిఫికేషన్లు వివరాల్లోకి వెళ్తే.. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు. వీటికి డిసెంబర్ 30, 2022 నుంచి దరఖాస్తుల ప్రారంభం అయ్యాయి. జనవరి 31, 2023న ఈ ప్రక్రియ ముగియనున్నది.

అగ్రికల్చర్ ఉద్యోగాలు..

నేడు (జనవరి 30)న అగ్రికల్చర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం అయింది.

First published:

Tags: JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు