హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచి 1904 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

TS High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచి 1904 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ(Telangana) న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకి హైకోర్టు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జానియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్ , ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది నియామకాల కోసం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ(Telangana) న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీకి హైకోర్టు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జానియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు(Record Assistant), ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది నియామకాల కోసం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. తెలంగాణ కోర్టుల్లో ఆఫీస్‌ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది నియామకాలకు 6 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.   వీటితో పాటు.. తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అంతే కాకుండా..  మార్చి తర్వాత విడుదల కాబోయే మిగిలిన నోటిఫికేషన్ల వివరాలను కు సంబంధించి నియామకాల క్యాలెండర్ విడుదల చేసింది హైకోర్టు.

అయితే  నాన్ టెక్నికల్ పోస్టులకు మొత్తం 6 నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కానుంది. అంటే రేపటి నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.  పోస్టుల వివరాలిలా..

నాన్ టెక్నికల్ పోస్టులు..

1. జూనియర్ అసిస్టెంట్

2. ఫీల్డ్ అసిస్టెంట్

3.ఎగ్జామినర్

4. రికార్డ్ అసిస్టెంట్

5. ప్రాసెస్ సర్వర్

6. ఆఫీస్ సబార్డినేట్

1.జూనియర్ అసిస్టెంట్

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. మొత్తం 275 పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

SSC CHSL: ఇంటర్ అర్హతతో 4500 ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

2.ఫీల్డ్ అసిస్టెంట్

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 77 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.ఎగ్జామినర్

ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మొత్తం 66 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

4.రికార్డ్ అసిస్టెంట్

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

5.ప్రాసెస్ సర్వర్

ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి మొత్తం 163 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

6.ఆఫీస్ సబార్డినేట్

ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని తెలంగాణలోని వివిధ జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు.

TSPSC Application Last Date: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పోస్టులకు మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

దరఖాస్తు ఫీజు..

ఈ 6 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్ కు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు ప్రారంభ తేదీ- జనవరి 11, 2023

దరఖాస్తులకు చివరి తేదీ- జనవరి 31, 2023

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ తేదీ- ఫిబ్రవరి 15, 2023

పరీక్ష తేదీ - మార్చి 2023

SBI Clerk Results Out: SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

టెక్నికల్ పోస్టులు..

మార్చి 2023లో టెక్నికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి. వీటిలో టైపిస్ట్ , కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల తేదీ- మార్చి 01, 2023

దరఖాస్తుల స్వీకరణ తేదీ - మార్చి 10, 2023

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ - మార్చి 31, 2023

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ తేదీ - ఏప్రిల్ 15, 2023

పరీక్ష తేదీ - ఏప్రిల్ / మే , 2023

నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. దరఖాస్తులలను  డైరెక్ట్ గా ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు.

First published:

Tags: Court jobs, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు