హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group 2 Coaching: టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

TSPSC Group 2 Coaching: టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో(Telangana) నిరుద్యోగుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు ఎప్పడూ చూడని నోటిఫికేషన్లను వాళ్లు చూస్తున్నారు. ఇది వరకు ఎప్పుడూ లేని నోటిఫికేషన్లు వాళ్ల కళ్ల ముందు కనపడుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) నిరుద్యోగుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు ఎప్పడూ చూడని నోటిఫికేషన్లను వాళ్లు చూస్తున్నారు. ఇది వరకు ఎప్పుడూ లేని నోటిఫికేషన్లు వాళ్ల కళ్ల ముందు కనపడుతున్నాయి. గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 4 వరకు అన్ని వర్గాల వారు ఉద్యోగాలు(Jobs) సాధించేందుకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వీటితో పాటు.. స్పెషల్ అర్హత ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఎన్నో విడుదలయ్యాయి. ఇక సంక్రాంతి ముందు గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన టీఎస్పీఎస్సీ(TSPSC) అనుకున్న విధంగానే జనవరి 13 రాత్రి 12 గంటల సమయంలో ఫలితాలను విడుదల చేసింది. దీనిలో 25వేలకు పైగా అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. ఇక అర్హత సాధించని అభ్యర్థులు మిగతా నోటిఫికేషన్లకు ప్రిపేర్(Prepare) అవుతున్నారు. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారు.

Bank Money Draw With Face ID: ఫేస్ ఐడీతో డబ్బులు డ్రా.. బ్యాంకుల కొత్త ఆలోచన..

ఇదిలా ఉండగా..గ్రూప్ 2 టార్గెట్ గా చదువుకుంటూ.. కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రైవేట్ లో కోచింగ్ తీసుకునే స్థామత లేని అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర బిసి ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్.. గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌ పరీక్ష కోసం ద్విభాషలో(ఇంగ్లీష్, తెలుగు) ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. జనవరి 20తో ఈ ప్రక్రియ ముగియనుంది. అంటే.. దరఖాస్తులకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.  దరఖాస్తుల సమర్పణకు డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.

జనవరి 21న సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయనున్నారు. ఇలా సెలెక్ట్ అయిన మొత్తం 200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి జనవరి 23వ తేదీ నుంచి టీఎస్ బీసీ స్టడీ సర్కిల్, ఓయూ సెంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో ఏ జిల్లా వారికైనా హైదరాబాద్ లో ఈ కోచింగ్ ఉంటుందని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. వీటికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. మీకు అకాడమిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిలో 33.33శాతం మహిళలు ఉండనున్నారు.

అర్హత గల అభ్యర్థులు https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో టెన్త్, ఇంటర్, డిగ్రీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికేట్, ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

రెగ్యూలర్ గా కాలేజ్ చేసే విద్యార్థులకు అవకాశం ఉండదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఇది వరకు రాష్ట్రంలో ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వారు కూడా అనర్హులుగా తెలిపారు.

మరిన్ని వివరాల కోసం, 040-27077929, 7780359322 నంబర్‌లను సంప్రదించవచ్చు. ఇక ఫిబ్రవరి 18 నుంచి గ్రూప్ 2 అప్లికేషన్స్ ప్రారంభం కానుండగా చివరి తేదీ ఫిబ్రవరి 16 గా ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ.

First published:

Tags: Free coaching, JOBS, TSPSC, Tspsc group 2, Tspsc jobs

ఉత్తమ కథలు