స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5369 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ.. సెకండరీ స్థాయి, సీనియర్ సెకండరీ స్థాయి మరియు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు/స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ప్రభుత్వ సంస్థల క్రింద గ్రాడ్యుయేట్ స్థాయిలో వివిధ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్చి 06 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 27గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే రేపటితో ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 4 వరకు సవరణలు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్-జూలై 2023లో నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 5369
ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు..
పోస్టును అనుసరించి అభ్యర్థులు మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Jobs In Metro Rail: మెట్రో రైల్ లో ఉద్యోగాలు .. జీతం రూ.25వేలు..
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు ఉంటుంది.
ఎంపిక విధానం ఇలా..
స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం..
మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. వీటిలో ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc, Staff Selection Commission