ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి యువతకు శుభవార్త చెప్పింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO). తాజాగా సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (DRDO-CEPTAM) ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B మరియు టెక్నికల్ A (DRDO రిక్రూట్‌మెంట్ 2022) పోస్టులను భర్తీ చేయడానికి DRDO దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు drdo.gov.in వద్ద DRDO యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అంటే నేటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1901 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా పోస్టులు..
1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి 1075 పోస్టులు
2. టెక్నీషియన్-ఎ 826 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1901
విద్యార్హతలు:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B: సైన్స్ లో బ్యాచలర్ డిగ్రీ చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసి ఉండాలి.
టెక్నీషియన్-A: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష. అలాగే, గుర్తింపు పొందిన సంస్థ నుండి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ - సెప్టెంబర్ 3
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ - సెప్టెంబర్ 23
ల్యాబొరేటరీ ఆఫీసర్, సూపరింటెండెంట్ పోస్టులు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఆర్డిఓ (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గాంధీనగర్ ల్యాబొరేటరీ ఆఫీసర్, సూపరింటెండెంట్(Superintendent), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(Executive Assistant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం https://www.diat.ac.inలింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేస్తారు.
Job Tips: ఎంత ట్రై చేసిన జాబ్ రావట్లేదా? అయితే.. ఈ 6 టిప్స్ పాటిస్తే జాబ్ పక్కా.. ఓ లుక్కేయండి
సంబంధిత పోస్టులను అనుసరించి డిగ్రీ (ఇంజనీరింగ్)/డిప్లొమా/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు డిప్యూటీ రిజిస్ర్టార్ అడ్మిన్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (టీమ్డ్ టు బి యూనివర్సిటీ), గిరినగర్, పూణే (మహారాష్ట్ర) - 411025 అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 31, 2022. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.diat.ac.inసందర్శించి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, DRDO, Drdo jobs, JOBS