హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి CDPO పోస్టులు.. దరఖాస్తులకు మరి కొన్ని రోజులే గడువు..

TSPSC Notification: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి CDPO పోస్టులు.. దరఖాస్తులకు మరి కొన్ని రోజులే గడువు..

TSPSC Notification: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి CDPO పోస్టులు.. దరఖాస్తులకు మరి కొన్ని రోజులే గడువు..

TSPSC Notification: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి CDPO పోస్టులు.. దరఖాస్తులకు మరి కొన్ని రోజులే గడువు..

ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 10 నోటిఫికేషన్లకు పైగా వెల్లడి అయ్యాయి. దీనిలో భాగంగానే మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో కూడా ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 10 నోటిఫికేషన్లకు పైగా వెల్లడి అయ్యాయి. దీనిలో భాగంగానే మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో కూడా ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ అనేది సెప్టెంబర్ 13 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. అంటే దరఖాస్తుల ముగింపు గడువు దగ్గర్లోనే ఉంది. ఎవరైనా ఇంకా దరఖాస్తులు సమర్పించకపోతే.. త్వరగా అప్లికేషన్లు చేసుకోవాలని.. చివరి తేదీ వరకు వేచి చూడకుండా.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు మాత్రమే అర్హత ఉందనే సంగతి తెలిసిందే. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 చెల్లించనున్నారు.

Postal Jobs 2022: గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

అర్హతలు..

1) బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ లేదా సోషల్‌ వర్క్ ఆర్ సోషియాలజీ

(OR)

2) B.Sc.(ఆనర్స్) - ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్;

(OR)

3) B.Sc. ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ &

కెమిస్ట్రీ / బయో - కెమిస్ట్రీ;

(OR)

4) B.Sc. అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ /

జువాలజీ & కెమిస్ట్రీ,

(OR)

5) B.Sc-క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ &

కెమిస్ట్రీ / బయో-కెమిస్ట్రీ;

(OR)

6) B.Sc అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ &

కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ

(OR)

7) B.Sc - ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్,

జువాలజీ / బోటనీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ

(OR)

8) B.Sc ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్, బోటనీ /

జువాలజీ & కెమిస్ట్రీ

(OR)

9) B.Sc ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రిషన్ & బోటనీ /

జువాలజీ & కెమిస్ట్రీ;

(OR)

10) B.Sc ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్,

వృక్షశాస్త్రం / జంతుశాస్త్రం & రసాయన శాస్త్రం / బయో-కెమిస్ట్రీ

పైన పేర్కొన్న అర్హతలో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.

Jobs In FCI: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాలు .. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు..

దరఖాస్తు చేసుకోండిలా..

- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-దీనిలో టాప్ లో అప్లికేషన్ ఫర్ ది సీడీపీఓ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానాని ఎంచుకోవాలి.

-తర్వాత అభ్యర్థుల యొక్క ఓటీఆర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి.. దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

-ఇప్పటికే ఓటీఆర్ ను నమోదు చేసుకోలేని వారు.. అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి ఓటీఆర్ ను నమోదు చేసుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TSPSC

ఉత్తమ కథలు