హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Last Date to Apply: 6432 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తుల గడువు..

Last Date to Apply: 6432 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తుల గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 6432 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 6432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీ అంటే ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవానికి ఈ నెల 22న అంటే రేపటితో ఈ గడువు ముగుస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వెయిట్ చేసి.. సర్వర్ సమస్యలతో బాధపడే కంటే.. ఈ లోగా దరఖాస్తులు చేసుకుంటే మంచిది. అభ్యర్థులు ibps.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు.

TSPSC Group 4 Update: గ్రూప్ 4 ఉద్యోగాలపై అప్ డేట్.. ఆ నెలలో నోటిఫికేషన్ విడుదల..!


బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు


S.Noబ్యాంక్ఖాళీలు
1.కెనరా బ్యాంక్2500
2.యూకో బ్యాంక్550
3.బ్యాంక్ ఆఫ్ ఇండియా535
4.పంజాబ్ నేషనల్ బ్యాంక్500
5.పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్253
6.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా2094
మొత్తం: 6432


విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే.. ఈ ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపిక: ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ టెస్ట్, మెయిన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.

ఎలా అప్లై చేయాలంటే:

Step 1: అభ్యర్థులు మొదటగా ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: హోం పేజీలో కనిపించే “CLICK HERE TO APPLY ONLINE FOR CRPPROBATIONARY OFFICERS/ MANAGEMENT TRAINEES (CRP-PO/MT-XII)” ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3:  అనంతరం “CLICK HERE FOR NEW REGISTRATIONఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: అప్లికేషన్ ఫామ్ ను జాగ్రత్తగా నింపాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.

Step 5: అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Step 6: దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ/ఎస్టీ/PWBD అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.850 చెల్లిస్తే సరిపోతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs, Bank news, Career and Courses, Central Government Jobs, IBPS, Ibps clerks, Ibps po, JOBS

ఉత్తమ కథలు