హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Application Dates: TSPSC నుంచి విడుదలైన ఈ 2 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. మరి కొన్ని గంటలే సమయం..

TSPSC Application Dates: TSPSC నుంచి విడుదలైన ఈ 2 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. మరి కొన్ని గంటలే సమయం..

TSPSC Application Dates: TSPSC నుంచి విడుదలైన ఈ 2 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. మరి కొన్ని గంటలే సమయం..

TSPSC Application Dates: TSPSC నుంచి విడుదలైన ఈ 2 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. మరి కొన్ని గంటలే సమయం..

ఇటీవల తెలంగాణలో పలు ఉద్యోగాల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం.. వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. టీఎస్పీఎస్సీ నుంచి ఇటీవల విడుదలైన రెండు నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఆ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల తెలంగాణలో పలు ఉద్యోగాల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం.. వెంటనే టీఎస్పీఎస్సీ (TSPSC ) నుంచి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. దాదాపు టీఎస్పీఎస్సీ నుంచి 8 నోటిఫికేషన్లకు పైగా వచ్చాయి. అందులో భాగంగానే ఆగస్టు 22, 2022న ఓ నోటిఫికేషన్(Notification) వెలువడింది. అదే తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఈ నెల 6 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులు సమర్పించడానికి నేడే (సెప్టెంబర్ 27) ఆఖరు తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులను సమర్పించవచ్చు.

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

ఇక మరో నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే.. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 181 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబలర్ 8న ప్రారంభం అయింది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అంటే దరఖాస్తు ప్రక్రియకు రెండు రోజుల్లో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష డిసెంబర్ లో ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది TSPSC.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్‌‍ సర్వీస్మెన్‌కు మూడేండ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి వేతనం రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాళేశ్వరం-26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 26, యాదాద్రి- 21, చార్మినార్‌- 21, జోగులాంబ- 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీగా ఉన్నాయి.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

విద్యార్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు హోమ్‌ సైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/బోటనీ/జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ/అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్/బోటనీ/క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్/బయో కెమిస్ట్రీ/ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్/జువాలజీ/బోటనీ అండ్‌ కెమిస్ట్రీ/బయోలాజికల్‌ కెమిస్ట్రీ లేదా అందుకు సమానమైన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Indian Railway jobs: రైల్వేలో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం రెండు పేపర్ల ద్వారా ఎంపిక ఉంటుంది. పేపర్‌-1లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ విభాగం నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2లో సంబంధిత డిగ్రీ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 300 మార్కులు కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు