తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) 1540 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నోటిఫికేషన్ విడుదలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా దీనికి సంబంధించి వెబ్ నోటీస్(Web Notice) విడుదల చేసి.. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్(Applications) అనేవి సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించారు. అయితే తాజాగా ఈ దరఖాస్తుల గుడువును మరో 5 రోజులు పెంచారు. గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో ఈ దరఖాస్తుల గడువును అక్టోబర్ 20కి పెంచారు. అయితే పొడిగించిన గడువు కూడా రేపటితో ముగియనుంది.
దరఖాస్తులు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే.. రేపు సాయంత్రం లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీల సంఖ్య: 1540
ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ (మిషన్ భగీరథ): 302 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).
ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).
ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). AMIE (సివిల్) పరీక్ష అర్హత ఉండాలి.
ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).
ఏఈఈ ఐసీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్).
ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్).
ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).
ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం..
నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిచి తెలుసుకోవచ్చు.
రాతపరీక్ష..
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి PDF కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Multi zonal in tspsc, TSPSC, Tspsc application fee, Tspsc jobs, Tspsc updates