హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Official App: యూపీఎస్సీ మొబైల్ యాప్ విడుదల.. ఒక్క క్లిక్ తో ఉద్యోగ సమాచారం..

UPSC Official App: యూపీఎస్సీ మొబైల్ యాప్ విడుదల.. ఒక్క క్లిక్ తో ఉద్యోగ సమాచారం..

UPSC Official App: యూపీఎస్సీ మొబైల్ యాప్ విడుదల.. ఒక్క క్లిక్ తో ఉద్యోగ సమాచారం..

UPSC Official App: యూపీఎస్సీ మొబైల్ యాప్ విడుదల.. ఒక్క క్లిక్ తో ఉద్యోగ సమాచారం..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ గురించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఇవ్వబడింది. మొబైల్ సహాయంతో అభ్యర్థులు ఈ యాప్‌లో పరీక్ష మరియు రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ గురించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఇవ్వబడింది. మొబైల్ సహాయంతో అభ్యర్థులు ఈ యాప్‌లో పరీక్ష మరియు రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. సమాచారం ఇవ్వడమే ఈ యాప్ ఉద్దేశమని యూపీఎస్సీ నోటీసులో స్పష్టంగా పేర్కొంది. UPSC అధికారిక వెబ్‌సైట్‌లోని నోటీసు ఇలా ఉంది.. "యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొబైల్ ద్వారా పరీక్ష మరియు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో UPSC ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షలు మరియు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు యాప్‌ని ఉపయోగించవచ్చు కానీ దరఖాస్తు ఫారమ్‌లను పూరించడానికి యాప్‌ను ఉపయోగించలేరు.

PhD After Graduation: యూజీసీ కొత్త నిబంధనలు.. 4 ఏళ్ల డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్ ..

వెబ్‌సైట్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వబడింది. UPSC ఆండ్రాయిడ్ యాప్‌ని ఈ లింక్‌ని ఉపయోగించి Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ ఇదే.. https://play.google.com/store/apps/details?id=com.upsc.upsc

యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ ఉంది

-Google Play స్టోర్‌ని సందర్శించండి లేదా పైన ఇచ్చిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.

-స్టోర్‌లో 'UPSC- అధికారిక యాప్' అని సెర్చ్ చేయండి.

-తర్వాత UPSC- Official App పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

-చివరగా మొబైల్‌లో అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి

యాప్ విడుదల చేసిన తర్వాత UPSC సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్స్ (AC) కోసం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం వివరణాత్మక దరఖాస్తు ఫారమ్ (DAF) ను విడుదల చేసింది . DAF సమర్పించడానికి విండో అక్టోబర్ 9 వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆగస్టు 7న పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ 18న ఫలితాలు విడుదల కానున్నాయి.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

ఇటీవల ఉద్యోగార్థుల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థుల సౌకార్యర్థం కొరకు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఓటీఆర్‌ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు. దరఖాస్తు చేసుకొని సమయంలో ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే మొత్తం వివరాలను ఆటోమేటిక్ గా ప్రత్యక్షం అవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కానుంది. దరఖాస్తు ప్రక్రియ కూడా వేగంగా పూర్తి అవుతుంది. ఈ ఓటీఆర్ ను https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే నమోదు చేసుకోవచ్చు లేదా ఎడిట్ చేసుకోవచ్చు. కొత్తగా ఈ యాప్ అందుబాటులోకి రావడంతో పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్‌తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్‌ ఉపయోగపడనుంది.

Published by:Veera Babu
First published:

Tags: Apps, Career and Courses, JOBS, UPSC

ఉత్తమ కథలు