GATE పరీక్ష 2023కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు రేపు అంటే 09 జనవరి 2023, సోమవారం జారీ చేయబడతాయి. అడ్మిట్ కార్డులను(Admit Cards) ఐఐటీ కాన్పూర్ విడుదల చేస్తుంది. గేట్ పరీక్ష 2023 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.in. నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. GATE పరీక్ష 2023 ఫిబ్రవరి 4, 5, 11 మరియు 12 తేదీల్లో నిర్వహించబడుతుంది. ఫలితాలు 16 మార్చి 2023న విడుదల చేయబడతాయి. జవవరి 03వ తేదీన అడ్మిట్ కార్డులు విడుదల కావాల్సింది.. కాన్ని కొన్ని కారణాల వల్ల ఈ అడ్మిట్ కార్డుల విడుదల తేదీని రేపటికి(జనవరి 09, 2023) వాయిదా వేశారు.
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి..
-అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే gate.iitk.ac.inని సందర్శించండి.
-ఇక్కడ హోమ్‌పేజీలో.. GATE 2023 అడ్మిట్ కార్డ్ అనే లింక్ ఇవ్వబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
-ఇలా చేయడం ద్వారా.. మీరు మీ లాగిన్ వివరాలను నమోదు చేయవలసిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివరాలను నమోదు చేసి, సమర్పించు బటన్‌ను నొక్కండి.
-ఇలా చేయడం ద్వారా.. మీ అడ్మిట్ కార్డ్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-ఇక్కడ నుంచి మీ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అనేది జాతీయ స్థాయి పరీక్ష, ఇది ప్రాథమికంగా ఇంజనీరింగ్ / టెక్నాలజీ / ఆర్కిటెక్చర్ / సైన్స్ / కామర్స్ / ఆర్ట్స్‌లో వివిధ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహనను పరీక్షిస్తుంది. పరీక్షకు సంబంధించిన ఎలాంటి సమాచారం కోసం అయినా.. అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే gate.iitk.ac.in. సందర్శించండి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, కర్నూలు , ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ , విశాఖపట్నం , విజయనగరం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు , నెల్లూరు , ఒంగోలు, తిరుపతి, హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
అనేక సంస్థలు GATE పరీక్ష యొక్క స్కోర్‌ను గుర్తించి.. గేట్ లో మంచి మార్కులు వచ్చిన వారికి తమ కాలేజీల్లో అడ్మిషన్ కు అవకాశం ఇస్తాయి. చాలా చోట్ల GATE పాస్ అభ్యర్థులను మాత్రమే నియమించుకుంటారు. అయితే.. గేట్ పరీక్ష స్కోర్ ఆధారంగా ప్రవేశం పొందిన కొన్ని పెద్ద విద్యా సంస్థల గురించి మాట్లాడినట్లయితే.. వాటి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. అందులో.. IIT బాంబే, IIT ఢిల్లీ, IIT గౌహతి, IIT కాన్పూర్, IIT ఖరగ్‌పూర్, IIT మద్రాస్, IIT రూర్కీ మరియు IISc బెంగళూరు ఉన్నాయి.
దేశంలోనిటాప్ ఇంజనీరింగ్(Engineering) కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్ ఎగ్జామ్‌ను IITకాన్పూర్ (IIT Kanpur) నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. పూర్తి వివరాలకు https://gate.iitk.ac.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Gate 2023, IIT, JOBS, Students