ఆస్ట్రేలియా(Australia )కు చెందిన ప్రముఖ డీకిన్ యూనివర్సిటీ (University)అందిస్తున్న ‘వైస్-ఛాన్సలర్స్ మెరిటోరియస్ 100 పర్సెంట్ స్కాలర్షిప్- 2022’ కోసం నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా(Australia )కు చెందిన ప్రముఖ డీకిన్ యూనివర్సిటీ (University) అందిస్తున్న ‘వైస్-ఛాన్సలర్స్ మెరిటోరియస్ 100 పర్సెంట్ స్కాలర్షిప్- 2022’ కోసం నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వహించిన ‘లీడర్స్ ఆఫ్ టుమార్’ ఎపిసోడ్లో అన్విషా చోప్రా, అర్నాబ్ బోర్డోలోయ్, ఆర్యన్ వదేరా, శ్రుతి అరోరాలు విజేతలుగా నిలిచినట్లు ప్రకటించారు. కాగా డీకిన్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటి. 1994లో తన ఆఫీస్‌ను ఇండియా(India)లో ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీలో 28 ఏళ్లుగా సేవలు
న్యూఢిల్లీ కేంద్రంగా డీకిన్ యూనివర్సిటీ భారత్‌లో తన కార్యకలాపాలను గత 28 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ‘ఛేంజింగ్ లైవ్స్’ లో భాగంగా 2014లో డీకిన్ యూనివర్సిటీ.. వైస్-ఛాన్సలర్స్ మెరిటోరియస్ 100 పర్సెంట్ స్కాలర్షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. ఇది ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవడానికి విద్యార్థులకు మద్దతునిస్తుంది.
వైస్-ఛాన్సలర్స్ మెరిటోరియస్ 100 పర్సెంట్ స్కాలర్షిప్ కోసం దేశవ్యాప్తంగా 800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. ఆ తరువాత కఠినమైన ఎంపిక ప్రక్రియ అయిన గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఎడ్యుకేషన్‌లో క్రిటికల్ టెక్నాలజీస్ ప్రాముఖ్యత, ఫ్యూచర్ వర్క్‌పై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్‌కు ఆరుగురు అభ్యర్థులు ఎంపికయ్యారు. స్కాలర్షిప్ విజేతలను న్యాయమూర్తుల ప్యానెల్ ఎంపిక చేసింది.
డీకిన్లో చదువుకునే అవకాశం
స్కాలర్షిప్ విజేతలు ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీలో చదవనున్నారు. అలాగే వైస్-ఛాన్సలర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్‌లో భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఇది వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత ఆకాంక్షలు, కెరీర్ అవకాశాలను అన్వేషించడంలో వారికి సహాయపడే అభివృద్ధి కార్యక్రమం. ఈ సంవత్సరం స్కాలర్షిప్ గ్రహీతలలో ఒకరైన శ్రుతి అరోరా మాట్లాడుతూ.. ‘‘ నా సామర్థ్యాన్ని చేరుకోవడానికి, నేను బలంగా నమ్మే లక్ష్యం కోసం పని చేయడం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఈ స్కాలర్షిప్ నాకు ఒక అవకాశం. ఈ స్కాలర్‌షిప్‌తో, నేను దాన్ని పొందగలుగుతాను. డీకిన్లో బ్యాచిలర్ ఆఫ్ సైకలాజికల్ సైన్సెస్ని అధ్యయనం చేయడం ద్వారా ఎక్స్‌పీరియన్స్‌లో వైవిధ్యం సాధించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని సానుకూల మార్గంలో ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు.’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
డీకిన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఇయాన్ మార్టిన్ మాట్లాడుతూ.. " మా క్యాంపస్‌లలో 130 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. కొత్త దృక్కోణాలు, ఆలోచనలతో శక్తివంతమైన ఉన్నత విద్యా ప్రమాణాలను తీసుకురావడమే మా లక్ష్యం. వైస్-ఛాన్సలర్స్ మెరిటోరియస్ 100 పర్సెంట్ స్కాలర్షిప్- 2022 విజేతలకు అభినందనలు. ఆస్ట్రేలియాలో వారు తమ సమయాన్ని మాతో ఆస్వాదించడం, పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడం కోసం మేం ఎదురు చూస్తున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు.
డీకిన్ యూనివర్సిటీ ఇతర అకడమిక్ ఫర్ఫార్మెన్స్ బేస్డ్ బర్సరీస్, ఆన్లైన్, క్యాంపస్ స్టడీలపై పూర్తి ట్యూషన్ ఫీజులో 20 నుంచి 25 శాతం స్కాలర్‌షిప్‌లుగా కూడా అందిస్తుంది. మరిన్ని వివరాలకు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.deakin.edu.au ను సందర్శించాలని డీకిన్ యూనివర్సిటీ సూచించింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.