TGWDCW Jobs: టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూలో 265 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు

టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ జాబ్స్

తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులు రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఈ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

  • Share this:
    తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులు రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఈ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు అర్హుల‌ను వివాహిత మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ జిల్లాలో మొత్తం క‌లిపి 265 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ రాజ‌న్న సిరిసిల్ల‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభ్య‌ర్థుల‌కు సెప్టెంబ‌ర్ 30, 2021, వికారాబాద్ అభ్య‌ర్థుల‌కు సెప్టెంబ‌ర్ 23, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    ఖాళీల సమాచారం



















    జిల్లా పోస్టుల సంఖ్య
    రాజన్న సిరిసిల్ల 20
    వికారాబాద్ 81
    మహబూబ్ నగర్ 164

    CCMB Hyderabad: సీసీఎంబీ హైద‌రాబాద్‌లో సైంటిస్ట్ ఉద్యోగాలు


    అర్హతలు..
    - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
    - విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి పాసవ్వాలి.

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
    Step-1 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://mis.tgwdcw.in/ ను సంద‌ర్శించాలి.
    Step-2 : అక్క‌డ Please Click Here to Fill your Application Form క్లిక్ చేయాలి.
    Step-3 : ద‌ర‌ఖాస్తును పూర్తిగా త‌ప్పులు లేకుండా నింఆలి.
    Step-4 : ద‌ర‌ఖాస్తు పూర్తి చేశాక ప్రివ్యూ (Preview) చూసుకోవాలి.
    Step-5 : త‌ప్పులు లేకుండా ఉంటే సబ్‌మిట్ చేయాలి.
    Step-6 : స‌బ్‌మిట్ చేసిన అనంత‌రం ర‌సీదు వ‌స్తుంది. దాన్ని భ‌ద్ర ప‌రుచుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published: