Home /News /jobs /

TET RESULTS WILL BE RELEASED ON JULY 1 STATE EDUCATION MINISTER SABITA INDRAREDDY WILL RELEASE THE TET RESULTS TOMORROW AT 11 30 AM VB

TS TET 2022 Results: రేపే టెట్ ఫలితాలు.. టెట్ తుది కీలో 13 ప్రశ్నలకు మార్పులు..

ప్రతీకాత్మక చిత్రం (Image Source : Ts Tet )

ప్రతీకాత్మక చిత్రం (Image Source : Ts Tet )

తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ ను నిర్వహించారు విద్యా శాఖ అధికారులు. విద్యాశాఖలో భారీగా టీచర్ల ఖాళీలు ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు ముందడుగు వేసింది.

తెలంగాణ(Telangana) ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ ను నిర్వహించారు విద్యా శాఖ అధికారులు. విద్యాశాఖలో భారీగా టీచర్ల ఖాళీలు ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఐదేళ్ల తర్వాత మార్చి 24న తెలంగాణలో మూడో టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2022 Notification) విద్యాశాఖ విడుదల చేసింది. మొదటి సారి టెట్ పేపర్ 1 కు బీఈడీ చేసిన వాళ్లను అర్హులుగా పేర్కొనడంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ (TS TET Exam) ను జూన్ 12వ తేదీన నిర్వహించారు అధికారులు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగగా.. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ను నిర్వహించారు. అయితే.. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ అవి వాయిదా పడ్డాయి.

Army Recruitment Rally In Suryapet: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..


ఈ టెట్ ఫలితాలను జూలై 1 విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. జూన్ 29న టెట్ ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. ఈ కీలో కొన్ని ప్రశ్నలకు మార్కులను కలుపగా.. మరికొన్ని ప్రశ్నలు డబుల్ సమాధాలను ఇచ్చారు. పేపర్ 1లో 4 మార్కులను కలపగా.. మరో 4 ప్రశ్నలకు రెండు సమాధానాలను గుర్తించారు. మొత్తంగా 8 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే.. మ్యాథమేటిక్స్ , సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కీలో నాలుగు మార్కులను కలుపగా.. మరో ప్రశ్నకు రెండు సమాధానాలను గుర్తించారు.

దీనిలో మొత్తల 5 ప్రశ్నలకు మార్పులు చేశారు. పేపర్-1కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. పేపర్ 2కు సంబంధించి మొత్తం 4,663 అభ్యంతరాలు రావడంతో అధికారులు వాటిని పరిశీలించి తుది కీని జూన్ 29 అర్థరాత్రి విడుదల చేశారు. ఎట్టకేలకు ఈ టెట్ ఫలితాలు జులై 1వ తేదీన విడుద‌ల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల కోసం www.tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Agnipath Agniveers Salaries: అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల.. అగ్నివీరులకు వేతనం ఎంతో తెలుసా?


తెలంగాణ పది ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు (TS Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కేవలం 51.89 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TS TET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు