Army Jobs: ఆర్మీ జాబ్స్‌కు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... నోటిఫికేషన్ వివరాలివే

Army Recruitment Rally | ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 26, 2019, 2:49 PM IST
Army Jobs: ఆర్మీ జాబ్స్‌కు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... నోటిఫికేషన్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)
  • Share this:
ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి 25 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. టెర్రిటోరియల్ ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ), క్లర్క్, షెఫ్ కమ్యూనిటీ, షెఫ్ స్పెషల్, హెయిర్ డ్రెస్సర్, ఈఆర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్తాన్, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్, పాండిచ్చెరి అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనొచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Army Recruitment Rally: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...



దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 7
భర్తీ చేయనున్న పోస్టులు: టెర్రిటోరియల్ ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ), క్లర్క్, షెఫ్ కమ్యూనిటీ, షెఫ్ స్పెషల్, హెయిర్ డ్రెస్సర్, ఈఆర్
విద్యార్హత: సోల్జర్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 45% మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో 33% మార్కులు తప్పనిసరి. లేదా 12వ తరగతి పాస్ కావాలి. సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుకు 10వ తరగతి, సోల్జర్ క్లర్క్ పోస్టుకు 60% మార్కులతో 10+2 పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో 50% మార్కులు తప్పనిసరి.
అభ్యర్థుల వయస్సు: 18 నుంచి 42 ఏళ్లు
కొలతలు: ఎత్తు-160 సెంటీమీటర్లు, ఛాతీ- 77 సెంటీమీటర్లు, బరువు 50 కిలోలుఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌తో పాటు ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లతో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్లాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఆధార్ కార్డ్ లేకపోతే ఫిజికల్ టెస్టుకు అనుమతించరు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో డీఆర్‌డీఓలో 224 జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Railway Jobs: రైల్వేలో 149 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: September 23, 2019, 9:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading