హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS 10th Exams 2022:రెండేళ్ల తర్వాత టెన్త్ ఎగ్జామ్స్..కండీషన్స్‌ అండ్ డిటెయిల్స్

TS 10th Exams 2022:రెండేళ్ల తర్వాత టెన్త్ ఎగ్జామ్స్..కండీషన్స్‌ అండ్ డిటెయిల్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS 10th Exams 2022:రెండేళ్ల తర్వాత తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రం వ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ కోసం 2861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5.09లక్షల మంది ఎగ్జామ్స్‌కి హాజరవుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగూణంగానే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...

పాఠశాల విద్య నుంచి కాలేజీ చదువులకు ప్రమోషన్ పొందే అర్హత పరీక్షలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ(Telangana)లో సోమవారం(Monday) నుంచి పదవ తరగతి పరీక్షలు (SSC Exams)జరగనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా (Corona)కారణంగా గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేదు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలల్లో చదువుకున్న 5లక్షల 9వేల మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. టెన్త్ ఎగ్జామ్స్ కోసం 2861 పరీక్ష కేంద్రాల(Exam centers)ను ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు.

రెండేళ్ల తర్వాత ఎగ్జామ్స్..

కరోనా తగ్గుముఖం పట్టినప్పటికి పదవ తరగతి పరీక్షల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు అనుగూణంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు.వేసవి తీవ్రత దృష్ట్య ఎగ్జామ్స్ సెంటర్స్‌లో మంచినీళ్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్వశ్చన్ పేపర్‌ లీకేజీకి కాకుండా ఎగ్జామ్‌ సెంటర్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారులతో సిట్టింగ్ స్కాడ్‌ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్ధులే కాపీయింగ్‌కి పాల్పడితే డీఈవో, ఎంఈవోలే బాధ్యత అని సూచించారు.

ఆల్‌ ది బెస్ట్ ..

ప్రాధమిక విద్య నుంచి మాధ్యమిక విద్యలోకి ప్రవేశించాలంటే విద్యార్ధులు టెన్త్‌ ఎగ్జామ్స్‌ పాస్ కావాల్సి ఉంటుంది. ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో పరీక్షలు రాయాలని ఎలాంటి ఒత్తిడులు, భయాందోళనలకు లోనవకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్‌Exams‌ రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎగ్జామ్స్‌కు నూటికి నూరు శాతం స్టూడెంట్స్‌ హాజరై పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. స్టూడెంట్స్‌ సకాలంలో ఎగ్జామ్స్‌ సెంటర్స్‌కి చేరుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బస్‌పాస్‌తో పాటు హాల్‌టికెట్ ఉంటే స్టూడెంట్స్‌కి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

చేయకూడనవి..

ఎగ్జామ్‌కి ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా సెంటర్లలోకి అనుమతి ఉండదు. పేపర్‌ లీక్‌, మాస్ కాపీయింగ్‌ వంటికి పాల్పడకూడదు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీ సాయం ఉపయోగిస్తున్నారు అధికారులు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసినా, వీడియోలు తీసినా పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 25, 1997 ప్రకారం క్రిమినల్‌ కేసు నమోదుచేస్తారు. నేరం రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష. 5 వేల రూపాయల నుంచి లక్ష వరకు జరిమానా విధిస్తారు.

చేయాల్సినవి..

టెన్త్ ఎగ్జామ్స్‌ రాసే ప్రతి స్టూడెంట్ తప్పని సరిగా మాస్క్ ధరించాలి. ఎగ్జామ్ సెంటర్లకు వాటర్ బాటిల్, శానిటైజర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే.. పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు హాజరుకావాలి. టెన్త్ విద్యార్థులకు బస్‌ పాస్‌తో పాటు హాల్‌ టికెట్ ఉంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

First published:

Tags: Ssc exams, Telangana

ఉత్తమ కథలు