• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TEMPORARY EMPLOYMENT IN MEDICAL AND HEALTH DEPARTMENT CM KCR GIVES ORDERS VRY

CM kcr : వైద్య ఆరోగ్య శాఖలో 50వేల తాత్కాలిక ఉద్యోగాలు : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

CM kcr :  వైద్య ఆరోగ్య శాఖలో 50వేల తాత్కాలిక ఉద్యోగాలు : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

CM kcr : తెలంగాణ సీఎం కేసిఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని నిర్ణయించారు.

  • Share this:
తెలంగాణ సీఎం కేసిఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసిఆర్.

కరోనాతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో సంవత్సరం కాలంగా కరోనా బాధితులతో ప్రభుత్వ వైద్యులు తీరిక లేకుండా ఉండడంతో ...ఆసుపత్రుల్లో   వైద్యులపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం భావించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల కొరత కూడ ఉంది. ఈనేపథ్యంలోనే కరోనా కాలంలో పనిచేసేందుకు మొత్తం 50వేల తాత్కాలిక వైద్యులతోపాటు పారమెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్స్‌ను నియమించాలని సీఎం నిర్ణయించారు. అయితే ఇందుకోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మూడు నెలల పాటు ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ధరఖాస్తులు ఆహ్వానించాలని ఆదేశించారు. అయితే మూడు నెలలకు కోసం నియమించుకుంటున్న వారికి భవిష్యత్ ఉద్యోగాల్లో వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు రాష్ట్ర రాజధానికి దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రులపై కూడ సీఎం దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్‌, వరంగల్ నగరంలో   సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దీంతోపాటు వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు చేసిన కాకతీయ మెడికల్ కాలేజీలోని ఆసుపత్రిలో సిబ్బందిని సైతం నియమించాలని ఆధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న పలు ఆసుపత్రుల్లో ఇదివరకే సిబ్బందిని నియమించేందుకు నోటిపికేషన్ కూడ జారీ చేసిన విషయం తెలిసిందే.

కరోనా నుండి కోలుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల ప్రయోజనం లేదని సీఎం ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో కరోనా కట్టడి, మరియు చికిత్సలపై దృష్టి సారించారు సీఎం కేసిఆర్. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తికి కారణమైన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించాలని సీఎం సూచించారు. దీంతో ప్రజల మధ్య నిత్యం తిరిగే ఆటోలు , ట్యాక్సి డ్రైవర్లలతో పాటు ,వీది వ్యాపారులు ,గ్యాస్ డెలివరి బాయ్స్ ను గుర్తించి టీకా ఇప్పించాలని చెప్పారు. అనంతరం కేంద్రమంత్రి హర్షవర్థన్ తో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై పోన్లో చర్చించారు.

ఇక తెలంగాణలోనేడు 5186 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నేడు మొత్తం 7994 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా.. 38 మరణించారు. ఇవాళ్టి కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. ఇప్పటి వరకు 4,21,219 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 2704 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 68, 462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. ఇప్పటి వరకు 4,21,219 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 2704 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 68, 462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by:yveerash yveerash
First published: