Home /News /jobs /

Free Online Courses: భారత విద్యార్థులకు ఉచిత ఆన్ లైన్ కోర్సులు.. కోర్సెరా బంపర్ ఆఫర్

Free Online Courses: భారత విద్యార్థులకు ఉచిత ఆన్ లైన్ కోర్సులు.. కోర్సెరా బంపర్ ఆఫర్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల బోధనా సంస్థ కోర్సెరా (Coursera) కీలకమైన ముందడుగు వేసింది. భారత్‌లో విద్యార్థులకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులను బోధిస్తామని ప్రకటించింది. ఈ ఆన్ లైన్ కోర్స్ ప్లాట్ ఫాం ప్రధానంగా మూడు విభిన్న కేటగిరిల్లో ఉచితంగా బోధించనుంది.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, పరిశుభ్రత, ఉద్యోగుల పని విధానాల్లో మార్పులు, వైద్య పరిశోధనలు ఇలా చాలా రంగాల్లో క్రియాశీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఆన్ లైన్ కోర్సు ప్రాధాన్యత పెరిగింది. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ప్రతి కోర్సును ఆన్ లైన్ ద్వారా బోధన చేస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల బోధనా సంస్థ కోర్సెరా (Coursera) కీలకమైన ముందడుగు వేసింది. భారత్‌లో విద్యార్థులకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులను బోధిస్తామని ప్రకటించింది. ఈ ఆన్ లైన్ కోర్స్ ప్లాట్ ఫాం ప్రధానంగా మూడు విభిన్న కేటగిరిల్లో ఉచితంగా బోధించనుంది.

* ఏయే కోర్సులంటే...
-నిపుణుల ద్వారా ఉచితంగా ఉద్యోగ నైపుణ్య కోర్సులు
- వ్యక్తిగత, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు
- పబ్లిక్ హెల్త్ నిపుణుల నుంచి ఉచిత కోర్సులు

నిపుణుల నుంచి ఉచిత ఉద్యోగ నైపుణ్య కోర్సుల కోసం విశ్వవిద్యాలయాలతో పాటు టెక్ దిగ్గజాల నుంచి వివిధ విభాగాలను అందుబాటులో ఉంచింది. ఉదాహరణకు కంప్యూటర్ విజన్ అప్లికేషన్స్ కోసం ఇంటెల్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్రడక్షన్, మైగ్రేట్ టూ గూగుల్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ మెషిన్ లెర్నింగ్ తదితర పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి. "ఈ ఛాలెజింగ్ సమయంలో కోర్సెరా.. భారత్ కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణుల ద్వారా స్పెషల్ కోర్సులను భారత విద్యార్థులకు ఉచితంగా బోధించనుంది" అని కోర్సెరా తన అధికారిక బ్లాగ్‌లో పోస్టు చేసింది. ఇక్కడ పేర్కొన్న కోర్సులను ఎంచుకొని నేర్చుకోవడం ప్రారంభించడం ద్వారా సర్టిఫికేట్ సంపాదించడానికి మీరు రాయితీ పొందవచ్చని ఈ లెర్నింగ్ ఫ్లాట్ ఫాం తెలిపింది. ఈ ఆఫర్లు మార్పులకు లోబడి కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 2020 జూన్ 30 వరకు ఇవన్నీ చెల్లుబాటులో ఉంటాయి.

కొన్ని రోజుల క్రితం మూడు ప్రముఖ వర్సిటీల్లో ఐదు నూతన డిగ్రీ ప్రొగ్రామ్‌లను ప్రారంభించినట్లు కోర్సెరా ప్రకటించింది. కొత్త డిగ్రీల్లో బ్రెజిల్, భారత్‌కు చెందిన విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొగ్రామ్స్ కూడా ఉన్నాయని తెలిపింది. గతేడాది కోర్సెరా ద్వారా 3800కి పైగా కోర్సులు, 100 గైడెడ్ ప్రాజెక్టులు, 400 స్పెషలైజేషన్లు, 15 ప్రొఫెషనల్ సర్టిఫికేట్లకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా భారత్‌లో 993 వర్సిటీలు, 50 వేలకు పైగా కళాశాలలు, స్వతంత్ర సంస్థలు నుంచి విద్యార్థులు బోధనలు అందుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి అనుమతించింది.

Keywords
Published by:Shiva Kumar Addula
First published:

Tags: EDUCATION, Online classes, Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు