జియో టీవీలో టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు...

జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా టీ-సాట్ ప్రసారాలు అందించేందుకు టీ-సాట్ నెట్వర్క్ సిద్ధమైంది.

news18-telugu
Updated: July 22, 2020, 9:32 PM IST
జియో టీవీలో టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు...
జియో టీవీ, టీ-సాట్
  • Share this:
విద్యార్థులకు ఆన్ లైన్ ప్రసారాలు అందించడంలో ముందు వరసలో ఉన్న టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో ముందడుగు వేశాయి. ప్రైవేటు కమ్యూనికేషన్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా టీ-సాట్ ప్రసారాలు అందించేందుకు టీ-సాట్ నెట్వర్క్ సిద్ధమైంది. ఈ మేరకు టీ-సాట్, జియో టీవీ నెట్కర్క్ విభాగాలు గురువారం నుంచి ప్రసారాలు అందించాలని నిర్ణయించాయి. కరోనా ప్రభావం కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న విద్యారంగానికి ఆన్ లైన్ ప్రసారాలు అందిస్తున్న టీ-సాట్ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలకు జియో టీవీ యాప్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది. ఇప్పటికే 24 గంటల ప్రసారాలతో నాలుగు లక్షల సబ్ స్క్రైబ్స్ కలిగి ఉన్న టీ-సాట్ యాప్ తెలంగాణలోని 1.59 కోట్ల జియో ఖాతా దారులకూ ప్రసారాలు అందనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల జియో ఖాతాదారులకు టీ-సాట్ ప్రసారాలు ఉచితంగా చేరతాయి. జియో సంస్థ దేశ వ్యాప్తంగా ప్రసారం చేసే 700 ఛానళ్లలో 64 ఛానళ్లు విద్యకు సంబంధించినవి ఉండగా వాటి చెంతకు టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు చేరాయి. ఈ ప్రసారాలు వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో ఉండటం విద్యార్థులకు మరో అదనపు అవకాశంగా భావించాలి.

పాఠశాల విద్యతో పాటు ఉన్నత స్థాయి, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రసారాలు, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్య ప్రసారాలు, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తూ సేవలందిస్తున్న టీ-సాట్ కు జియో టీవీ నెట్వర్క్ తోడవడం సంతోషించాల్సిన విషయమని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద, మారు మూల ప్రాంత విద్యార్థులకు సేవలందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న టీ-సాట్ నిపుణ, విద్య ఛానళ్లకు జియో టీవి నెట్వర్క్ తోడవటం విద్యార్థి రంగంతో పాటు ఇతర రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జియో టీవీ


తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలను మా జియో టీవీ ద్వారా అందించడం తమకూ గర్వంగా ఉందని జియో టీవీ తెలంగాణ సీఈవో కె.సి.రెడ్డి అన్నారు. టీ-సాట్ ప్రసారాలను చూసే అన్ని వర్గాల ప్రజలకు జియో నెట్వర్క్ ద్వారా మరింత స్పష్టత, స్వచ్ఛత ఏర్పడనుందన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు టీ-సాట్ ద్వారా సేవ చేసే అవకాశం లభించడం సంతృప్తినిస్తోందని కె.సి.రెడ్డి. అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 22, 2020, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading