Home /News /jobs /

TELANGANA WORK ONLY 2 HOURS PER DAY AND GET 25 THOUSAND RUPEES MONTHLY INCOME HERE IS THE FACTS BEHIND THIS MESSAGE NS

నిత్యం రెండు గంటలు పనిచేస్తే చాలు.. నెలకు రూ. 25 వేల ఆదాయం.. ప్రకటన వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజుకు రెండు గంటలు పని చేస్తే నెలకు రూ. 25 వేలు సంపాధించవచ్చంటూ ఇటీవల స్మార్ట్ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నాయి. ఈ ఉద్యోగ ప్రకటన వెనక వాస్తవాలు ఇలా ఉన్నాయి.

    స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు అధికమైపోతున్నాయి. ఫోన్లకు మెసేజ్ లు పంపించి ఏదో ఓ ఆశ చూపి మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులే లక్ష్యంగా.. వారికి ఉద్యోగాల ఆశ చూపుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు, ఎలాంటి విద్యార్హత లేకున్నా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు, మెసేజ్ లను ఫోన్లకు పంపిస్తున్నారు. ఆ మెసేజ్ లు చూసి ఇది నిజమని నమ్మి అప్లై చేస్తే జాయినింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, కంపెనీ ఫీజు అని చెప్పి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా వందలు, వేల మంది నుంచి డబ్బులు వసూలు చేసిన అనంతరం ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అనంతరం వాళ్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవడం, ఆఫీసులు ఖాళీ చేయడంతో ఏం చేయాలో తెలియక బాధితులు తలలు పట్టుకుంటున్నారు.
    చేపల కూర విషయంలో వాగ్వాదం.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు..
    Fake Notes : ఆటో డ్రైవర్...యూ ట్యూబ్ ద్వారా నోట్ల ప్రింటింగ్...!

    తాజాగా.. ఇలాంటి మెసేజ్ లే ఫోన్లకు వస్తున్నాయి. లాక్ డౌన్లో మీ జాబ్ పోయిందా? ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్నారా? అయితే.. ప్రతీ రోజు మీ విలువైన 2 గంటలు మాకు కేటాయిస్తే చాలు.. నెలకు రూ. 25 వేలు ఇస్తామని కేటుగాళ్లు ఫోన్లకు మెసేజ్ లు పంపిస్తున్నారు. లాక్ డౌన్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.



    అయితే.. ఇలాంటి మోసాలపై తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా పోలీసులు స్పందించారు. సెల్ ఫోన్లకు వచ్చే ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరించారు. అలాంటి మెసేజ్ లను నమ్మితే అప్పుల పాలవుతారని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఊరూ.. పేరూ లేని మెసేజ్ లను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు పోలీసులు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Fake jobs, Job Mela, Jobs in telangana, Telangana Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు