తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ క్రీడా పాఠశాలల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం...

క్రీడా పాఠశాలల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీగా సెప్టెంబర్ 19గా నిర్ణయించినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 11:22 PM IST
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ క్రీడా పాఠశాలల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలల్లో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీగా సెప్టెంబర్ 19గా నిర్ణయించినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని క్రీడా పాఠశాలల్లో భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. సంబంధిత ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోచింగ్ లో మాస్టర్ ఎన్ఎస్ఎన్ఐఎస్ నుంచి ఒక సంవత్సరం డిప్లమా సర్టిఫికేట్‌తో పాటు అభ్యర్థులు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడలకు సంబంధించిన డిప్లమా సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్ధులు మాసాబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ అకాడమి సంప్రదించాలని sportsofficertwd@gmail.com మెయిల్ ఐడీకి దరఖాస్తులు  పంపించాల్సి ఉంది.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు