హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TTWREIS | Admissions: సైనిక దళాల్లో ఉద్యోగమే లక్ష్యంగా.. అడ్మిషన్లకు నోటిఫికేషన్..

TTWREIS | Admissions: సైనిక దళాల్లో ఉద్యోగమే లక్ష్యంగా.. అడ్మిషన్లకు నోటిఫికేషన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TTWREIS | Admissions: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వరంగల్ జిల్లా అశోక్ నగర్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఈ అడ్మిషన్లు జరగనున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ(Society) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వరంగల్ జిల్లా అశోక్ నగర్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఈ అడ్మిషన్లు(Admissions) జరగనున్నాయి. సైనిక దళాల్లో ఉద్యోగాలను కల్పించే లక్ష్యంగానే ఈ శిక్షణ ఉండనుంది. ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర దళాల్లో ఈ ఉద్యోగాలు(Jobs) కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పాఠశాలను ప్రారంభించగా.. ప్రస్తుతం బాలురకు మాత్రమే సైనిక శిక్షణపైనే దృష్టిసారించనున్నారు. ఇదిలా ఉండగా.. సీబీఎస్ఈ ఆరోతరగతి, సీబీఎస్ఈ ఎంపీసీలో ప్రవేశాలకు వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తున్నారు. ఒక్కో తరగతిలో 80 సీట్ల చొప్పున ఉన్నాయి.

Agriculture Jobs: అగ్రికల్చర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే చాలు.. 

వీటిలో అడ్మిషన్ కొరకు విద్యార్థులకు రాత పరీక్ష, శారీరక సామర్థ్యం, వైదర్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 08 వరకు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష కొరకు ఏప్రిల్ 25 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ కు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్‌ 30న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే 5న ఫలితాలు విడుదల చేస్తారు.

ఈ పరీక్ష ఫలితాలను ఎలాంటి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచరు. వారికి ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఇక ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్తులకు మే 8 నుంచి 13వరకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్‌ 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉండగా.. 2023–24 విద్యా సంవత్సరానికి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ప్రారంభించింది. మార్చి 27 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయింది. కేవీఎస్‌లో ఒకటో తరగతి ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు కాగా, అడ్మిషన్ టైమ్‌టేబుల్ అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in లో అందుబాటులో ఉంది. పిల్లల కోసం దరఖాస్తులను తల్లిదండ్రులు ఏప్రిల్ 17, సాయంత్రం 7 వరకు సమర్పించవచ్చు. అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలి.

First published:

Tags: Career and Courses, JOBS, Telangana

ఉత్తమ కథలు