టెట్(TET) నోటిఫికేషన్లో(Notification) వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు రావాల్సి ఉండగా.. అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. నేడు ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను https://tstet.cgg.gov.in/వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.. మరో వైపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా వరుసగా.. మొన్న ఇంటర్, నిన్న పది ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ నేడు టెట్ ఫలితాలను విడుదల చేయనుంది.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ పరీక్షల ఫలితాల విడుదలలో బిజీగా ఉన్నారు. నేడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదలు చేయనున్నారు. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది.. పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. రెండు రోజుల క్రితం తుది కీ విడుదల చేశారు. ఈ తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
అంబేద్కర్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్..
దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022-2023 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్ఐఎస్సీ (BLISc), ఎంఎల్ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.