హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS TET Results Released: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఫలితాలను ఇలా తెలుసుకోండి..

TS TET Results Released: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఫలితాలను ఇలా తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం (Image Source : Ts Tet )

ప్రతీకాత్మక చిత్రం (Image Source : Ts Tet )

టెట్‌ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

టెట్(TET) నోటిఫికేషన్లో(Notification) వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు రావాల్సి ఉండగా.. అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఎట్టకేలకు విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఈ  టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://tstet.cgg.gov.in/వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత TSTET Results - 2022 పై క్లిక్ ఇవ్వాలి. తర్వాత మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో టెట్ హాల్ టికెట్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడంతో ఫలితాలు వచ్చేస్తాయి.

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు

తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.. మరో వైపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా వరుసగా.. మొన్న ఇంటర్, నిన్న పది ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ టెట్ ఫలితాలను విడుదల చేశారు.  జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది.. పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు.ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. రెండు రోజుల క్రితం తుది కీ విడుదల చేశారు. ఈ తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

First published:

Tags: Career and Courses, JOBS, Results, TS TET 2022

ఉత్తమ కథలు