హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS 10th Supplementary Results: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

TS 10th Supplementary Results: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను (TS 10th Supplementary Results) అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 79.82 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ (Director Of School Education) శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పరీక్షలకు (Exams) గాను మొత్తం 55,663 మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో  48167 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 38447 మంది పాస్ అయినట్లు చెప్పారు. మొత్తంగా 79.82 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు చెప్పారు. వీరిలో బాలికలకు సంబంధించి 82.21 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కాగా.. బాలురకు సంబంధించి 78.42 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు తెలిపారు. ఫలితాల్లో మరోసారి బాలికలే పై చేయి సాధించారన్నారు.

  ఇంకా ఫలితాల్లో  సిద్దిపేట జిల్లా 97 శాతం ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందన్నారు. కొమురం భీం జిల్లా 53.11 శాతం పర్సంటేజ్ తో ఆఖరి స్థానంలో నిలిచినట్లు వివరించారు శ్రీదేవసేన. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చన్నారు. రేపటి నుంచి 12వ తేదీ వరకు రీవెరిపికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు హెడ్ మాస్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  TSPSC Jobs Updates: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీపై జోరుగా కసరత్తు.. టీఎస్పీఎస్సీ చైర్మన్ కీలక సమీక్ష

  రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ టెన్త్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Exams) ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించారు అధికారులు. మొత్తం 55,662 మంది విద్యార్థులు (Students) ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ విద్యాశాఖ.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exam results, JOBS, SSC results