రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు (Telangana Tenth Exams) నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Reddy) ప్రకటించారు. ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి పరీక్షలకు (Tenth Exams) సంబంధించి ఈ రోజు మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి 6 పేపర్లు, వంద శాతం సిలబస్ తో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంకా టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలన్నారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
వ్యాసరూప ప్రశ్నలకే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉందన్నారు. ఇంకా మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా పాస్ పర్సంటేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరు పేపర్లే!
ఈ ఏడాది నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, Career and Courses, JOBS, Sabita indra reddy, Telangana SSC board exams