పదో తరగతి(Tenth Class) పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం 11.30కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే కాలేజీలు(Colleges), పాఠశాలు(Schools) ప్రారంభం అయ్యాయి. నిన్ని (జూన్ 28)తెలంగాణ ఇంటర్ ఫలితాలు(Inter Results) విడుదలయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 67.16 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి. ఇక పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. అయితే పది ఫలితాల(Tenth Results)విడుదలకు విద్యాశాఖ అధికారులు సిద్ధం అయ్యారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
తెలంగాణలో పదో తరగతి(Tenth Class) వార్షిక పరీక్షలు గత నెల 23 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి రాష్ట్రంలో గ్రేడింగ్ విధానాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందు కు ఈ గ్రేడింగ్ విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. అయితే ఏపీలో గ్రేడింగ్ విధానాన్ని తీసేసి మార్కుల ద్వారా ఫలితాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణలో ఈసారి ఫలితాలు ఎలా ప్రకటిస్తారనే దానిపై చర్చ జరిగింది.
జూలై 1న టెట్ ఫలితాలు..
జూలై 1న టెట్ రిజల్ట్ ఇవ్వనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. టెన్త్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11.30కు మంత్రి సబిత ఇంద్రారెడ్డి రిలీజ్ చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈనెల 27వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెట్ ఫలితాలపై అధికారులతో చర్చించారు.
జాప్యం చేయకుండా జులై 1న ఫలితాలు విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈనెల 12న జరిగిన పరీక్షల్లో పేపర్ 1కు 3 లక్షల 18 వేల 506 మంది, పేపర్ 2కు 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. తుది కీ ఇంకా విడుదల కాలేదు. ఫలితాలతో పాటే తుది సమాధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, Career and Courses, JOBS