• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA TENTH AND INTER EXAMS MAY POSTPONED HERE FULL DETAILS NS

Telangana Tenth, Inter Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు జరగడం కష్టమేనా?

Telangana Tenth, Inter Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు జరగడం కష్టమేనా?

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కరోనా విజృంభిస్తుండడంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడడం లేదా రద్దు అయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఈ రోజు కూడా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం అందరికీ ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే ఇటీవల కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలను మూసివేసింది. ఈ సోమవారం నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మేలో జరగాల్సిన ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మే 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, మే 17 నుంచి 26 వరకు టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి ఫిజికల్ తరగతులకు బదులుగా ఆన్లైన్ క్లాసులను అధికారులు నిర్ణయించారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్కూళ్లు, కాలేజీలను ఓపెన్ చేసి ఫిజికల్ క్లాసులను నిర్వహించారు.

    అయితే కరోనా కేసులు మళ్లీ పెరగడంతో మార్చి 24 నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి మూసి వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి మళ్లీ ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అయితే ఆన్ లైన్ క్లాసులు ఎంత మేర అర్థం అవుతున్నాయన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్లు లేని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు పూర్తి స్థాయిలో హాజరు కాలేక పోతున్నారు. ఇదిలా ఉంటే.. విద్యాసంస్థలు నడిచిన కొన్ని రోజుల్లోనే ఆయా యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మొత్తం ఫీజులను వసూలు చేశాయి.

    దీంతో ఫీజులు కూడా కట్టాం కాబట్టి పరీక్షలను నిర్వహించాలని అనేక మంది పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలకు నిర్వహించకపోతే మెరిట్ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పరీక్షలను ఆపేస్తామని వారు అంటున్నారు.  పరీక్షలు రద్దు కాకపోయినా, వాయిదే పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ వరకు కరోనా ఉధృతి తగ్గితే అప్పుడు పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు