• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA TEACHERS TELANGANA GOVERNMENT TO CREDIT MONEY INTO PRIVATE TEACHERS ACCOUNTS TODAY UNDER CORONA HELP SCHEME HERE IS THE DETAILS NK

Telangana Teachers: తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు నేడు డబ్బు పంపిణీ... ఇలా పొందండి

Telangana Teachers: తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు నేడు డబ్బు పంపిణీ... ఇలా పొందండి

ప్రతీకాత్మక చిత్రం

Telangana Teachers: ఈ కరోనా వచ్చాక... ప్రైవేట్ టీచర్లు రోడ్డున పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Telangana Teachers: తెలంగాణ ప్రభుత్వం గత వారం ప్రకటించినట్లుగానే... ఇవాళ కరోనా సాయం పేరుతో ప్రైవేట్ టీచర్లకు డబ్బు ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ రూ.2,000 చొప్పున ఇస్తోంది. అలాగే... రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా... 25 కేజీల సన్నబియ్యం ఇవ్వబోతోంది. ఈ కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అనుకుంటోంది. ఇలా మొత్తం 24వేల మందికి పైగా ప్రయోజనం పొందబోతున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉంటే... అందరికీ ఆ ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అమలు చేస్తున్నారు. అసలీ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కరోనా. ఇది వచ్చాక... ఏడాదిగా ప్రైవేట్ స్కూళ్లు మూతపడటంతో టీచర్లు రోడ్డున పడ్డారు. స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నా... తమకు మాత్రం శాలరీలు ఇవ్వట్లేదని టీచర్లు తీవ్ర ఆవేదన చెందడంతో... వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

    దరఖాస్తుల వెల్లువ:
    గత వారం ప్రభుత్వం ఈ ప్రకటన చెయ్యగానే... 2,06,345 మంది తమకు ఆర్థిక సాయం కావాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా ప్రభుత్వం సోమవారం సాయంత్రం వరకూ దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని జల్లెడ పట్టగా... మొత్తం 1 లక్షా 24వేల మందికి సాయం చెయ్యవచ్చని వారిని లబ్దిదారులుగా డిసైడ్ చేశారు అధికారులు.

    బ్యాంక్ అకౌంట్లలోకి మనీ:
    లబ్దిదారులుగా ఎంపిక చేసిన వారి నుంచి అధికారులు బ్యాంక్ అకౌంట్ నంబర్లు, వివరాలూ తీసుకున్నారు. వారందరికీ ఇవాళ్టి నుంచి వారి అకౌంట్లలోకి డబ్బు జమ చేస్తారు. ఇలా డబ్బు క్రెడిట్ అవ్వగానే... ఆయా బ్యాంకుల నుంచి లబ్దిదారుల మొబైల్స్‌కి డబ్బు జమ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చాక... లబ్దిదారులు దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. లేదా బ్యాంకుకు వెళ్లి తీసుకోవచ్చు.

    ఈ నగదు పంపిణీ కార్యక్రమం ఇవాళ్టి నుంచి 24 వరకూ కొనసాగనుంది. అలాగే... బియ్యం పంపిణీ కార్యక్రమం 21 నుంచి 25 వరకూ కొనసాగనుంది. తెలంగాణలో స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యేవరకూ ఈ సాయం ప్రతి నెలా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

    ఇది కూడా చదవండి: Horoscope today 20-4-2021: నేటి రాశి ఫలాలు... ఈ రోజు ఆ రాశుల వారిదే...

    65వేల మందికి సాయం:
    ప్రభుత్వం లబ్దిదారులుగా ప్రకటించని వారు 65వేల మంది ఉన్నారు. వారికి కరోనా సాయం అనేది అందదు. మరి వారి పరిస్థితి ఏంటి అన్నది సమస్యగా మారింది. వారికి కూడా నిధులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పాపం వారంతా పేదలే. టీచింగ్ తప్ప వారికి వేరే ఏ వృత్తీ రాదు. దానిపైనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తలచుకుంటే... వారిని ఆదుకోవడం పెద్ద విషయమేమీ కాదు. ఏం చెయ్యాలో దిక్కుతోచక అప్పుల పాలవుతున్న టీచర్లను కాపాడితే... వారంతా ఎంతో బాధ్యతగా విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పి... తీర్చిదిద్దుతారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు