Home /News /jobs /

TELANGANA TEACHERS TELANGANA EDUCATION DEPARTMENT KEY DECISION ON TEACHER PROMOTIONS AND TRANSFERS EVK

Telangana Teachers: టీచ‌ర్ల ప‌దోన్న‌తులు, బ‌దిలీల‌పై తెలంగాణ విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

  టీచ‌ర్ల బ‌దిలీల‌పై తెలంగాణ (Telangana)  విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వచ్చే నెల (మే)లో ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. పాఠశాలల సెలవు రోజుల్లో దీనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఈ విషయంపై చర్చించడం కోసం టీచర్స్‌ ఎమ్మెల్సీలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశం తర్వాత టీచర్ల పదోన్నతులు, బదిలీలపై కొంత స్పష్టత రానుంది. ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించారు. దాంతో పాటు, వచ్చే ఏడాది నుంచి కొత్తగా ఇంగ్లిషు మీడియంను ప్రారంభిస్తున్నారు.

  TSPSC Group 1: నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1 నోటిఫికేషన్‌పై కీల‌క నిర్ణ‌యం వెలువ‌డే చాన్స్‌

  సీఎం కేసీఆర్‌ ఇచ్చి న హామీ మేరకు 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యా యుల పోస్టులు మం జూరు చేసి, ఎస్‌జీటీలకు ప్రమోషన్లు ఇస్తామని మం త్రి సబితా వివరిం చారు. ఫైల్ ను సాధారణ పరిపాలన శాఖకు పం పామని, మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వు లు వెలువడతాయని విద్యా శాఖ కార్య దర్శి సం దీప్‌కుమార్‌ సుల్తానియా చెప్పా రు. వచ్చే విద్యా సం వత్స రం (2022-23) ప్రవేశాలు ముగిసిన తర్వా తే ఉపాధ్యా యుల హేతుబద్ధీకరణ చేపడతారు. మోడల్‌ స్కూల్ ఉపాధ్యా యులకు తొమ్మి దేళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదని చర్చ సాగిం ది. ప్రస్తుత జోన్లప్రకారం ఆ ప్రక్రియలు పూర్తిచేయాలని నిర్ణయిం చారు.

  Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

  కసరత్తు పూర్తి..

  చాలా కాలం నుంచి ఉపాధ్యాయుల బదిలీలను చేయడం లేదు. అలాగే...ప్రమోషన్లను కూడా ఇవ్వడం లేదు. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ప్రక్రియలను ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే సమయంలో ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులను కేటాయించడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే స్కూళ్ల నుంచి టీచర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే విధంగా హేతుబద్ధీకరణను కూడా నిర్వహించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Telangana, Telangana schools

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు