రచయిత: వంశీకృష్ణ, SGT, జెడ్పీహెచ్ఎస్, లింగాపూర్
(P Mahender, News 18, Nizamabad)
స్కూల్ అసిస్టెంట్ (Teacher Jobs) కోసం ప్రిపేర్ అయ్యేవారు ఉదయం నాలుగు గంటలకు లేచి చదివేతే బాగా గుర్తువుంటుందని 19 సంవత్సరాల ఆనుభవం కలిగిన వంశీ కృష్ణ, ఎస్జీటి జడ్పీహెచ్ఎస్ లింగాపూర్, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్(Nizamabad) అన్నారు. ఒక టాపిక్ ను పది నుంచి పదిహేసు సార్లు చదివితే మనకు గుర్తుండి పోతుందన్నారు. దీంతో ఆ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సులువుగా సమాధానం ఇవ్వగలుగుతామన్నారు. ముఖ్యంగా స్కూల్ ఆసిస్టెంట్ విభాగంలో నాలుగు సబ్జెక్టులు ఉంటాయన్నారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ అని నాలుగు సబ్జెక్టులు ఉంటాయన్నారు. టెట్ (TS TET 2022) వెయిటేజీ 20 మార్కులు ఉంటాయన్నారు. 80 మార్కులకు డీఎస్సీ ఎగ్జామ్ ఉంటుందన్నారు. ఈ 80 మార్కులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ కంటెంట్, టీచింగ్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెట్ నుంచి 88 ప్రశ్నలు వస్తాయి.
ఒక క్వశ్చన్ కు ఆఫ్ మార్కు ఉంటుంది. 88 ప్రశ్నలకు 44 మార్కులు వస్తాయి. తర్వాత టీచింగ్ మెథడాలజీ కి 32 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 16 మార్కులు జనరల్ నాలెడ్జ్ పై ఉంటాయి. దేశాలు, రాజధానులు, అవార్డుల గురించి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ గురించి అంటే.. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాటి కంటే ఆరు నెలల ముందు నుంచి న్యూస్ పేపర్ చదువు కోవాలి. ప్రస్పేక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ అనేది మనకు బీఈడి బుక్ లో ఉంటుంది. దానిని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. కంటెంట్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న టెస్ట్ బుక్ ను ఫాలో కావాలి. ఆ సిలబస్ ఇంటర్మీడియట్ వరకు చదువు కుంటే మంచిగా మార్కులు సాధించుకోవచ్చు.
CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో CREDR సంస్థలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఎగ్జామ్ కు ప్రిపేర్ కావడానికి ముఖ్యంగా టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు మనకున్న టైం ను పద్ధతిగా టైంటేబుల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక బుక్ ను పది నుంచి పదిహేను సార్లు చదివితే అందులోని విషయాలన్నింటపై పూర్తిగా అవగాహనకు వస్తుంది. చదువు ఒక్కటే కాదు హెల్త్ కు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకోసం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. మంచి నిద్ర కూడా ఉంటే మనము చదివేది మానము గుర్తుంచుకుంటాం.
పరీక్షల్లో ఆన్సర్ చేయాగాలుగుతాము అన్నారు. ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య చదివితే ఆ టైమింగ్ లో చదివింది తప్పకుండా మనకు గుర్తుంటుంది. సాయంత్రం సమయంలో మెడిటేషన్ చేసుకుంటే మనం ఫ్రెష్ అవుతాము. తర్వాత చదువుతుంటే మంచిది. రాత్రిళ్లు నిద్ర పాడు చేసుకుని చదవడం వల్ల ఉపయోగం ఉండదు. స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ అయ్యే వారు ఇవన్నీ పాటిస్తే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Teacher jobs, Telangana government jobs, TS TET 2022