Home /News /jobs /

TELANGANA TEACHER JOBS ASPIRANTS CAN BE PREPARED IN THIS MANNER TO GET GOOD SCORE NS MBNR

TS Teacher Jobs: తెలంగాణ టీచర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇలా చదివితే మంచి రిజల్ట్.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాంగ్వేజ్ పండిట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని చిట్కాలు ఇలా ఉన్నాయి.

    రచయిత: సుమతి MA, తెలుగు ఉపాధ్యాయురాలు 
    (Syed Rafi, News18,Mahabubnagar)

    ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాంగ్వేజ్ పండిట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని చిట్కాలు (Tips) ఇలా ఉన్నాయి. అభ్యర్థులు ఇలా ప్రిపేర్ అయినట్లయితే కలల కొలువును సొంతం చేసుకోవచ్చు. లాంగ్వేజ్ పండిత్ తెలుగు పరీక్ష (Exam) మొత్తం 150 మార్కులకు కాగా.. అందులో తెలుగు 30, సైకాలజీ 30, మాథ్స్ 30, ఇంగ్లీష్ 30, ఈవీఎస్ జీకే 30 మార్కులు. అభ్యర్థులు మంచి మార్కులు సాధించాలంటే.. అభ్యర్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రవేశపెట్టిన ప్రభుత్వ పుస్తకాలు మంచిగా చదవాలి. ముఖ్యంగా తెలుగులో వ్యాకరణం బాగా నేర్చుకోవాలి. తద్వారా మార్కులు సులువుగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 100 మార్కులకు గాను 20 మార్కులు టెట్ వెయిటేజ్ లో ఉంటాయి.

    80 జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ కు సంబంధించి 20 ప్రశ్నలు పది మార్కులు ఉంటాయి. మరొకటి ఇన్స్టిట్యూట్ ఇన్ ఎడ్యుకేషన్ 20 ప్రశ్నలు. 10 మార్కులు ఉంటాయి. కంటెంట్ అనేది చాలా ముఖ్యమైనది. 88 ప్రశ్నలు అందులో ఉంటాయి 44 మార్కులు మాత్రమే ఇస్తారు. మరొకటి టీచింగ్ మెథడాలజీ లో 32 ప్రశ్నలు ఇస్తారు. 16 మార్కులు వస్తాయి. మొత్తంగా 80 మార్కులు 160 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్కు ఉంటుంది.
    Agniveer Exam Tips: అగ్నివీర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే..



    కరెంట్ అఫైర్స్ అనేటివి ముఖ్యమైనవని భావించి డీఎస్సీ నోటిఫికేషన్ పడక ముందు ఆరు నెల ముందు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ బుక్స్ చదివితే చాలా మంచిది. ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠ్యంశాలను మంచిగా చదువుకుంటే చాలా ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    తదుపరి వార్తలు