తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష(Sub Inspector Preliminary Written Test) ఆదివారం (ఆగస్టు 7) పోలీసుల బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష(Exam) మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 538 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ అభ్యర్థులు పరీక్షకు(Exam) హాజరయ్యారు. నిమిషం నిబంధన అమలులో ఉండటం కారణంగా కొంతమంది పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్ ను(Vehicles Parking) ఏర్పాటు చేసి అభ్యర్థుల తల్లిదండ్రులు సహాయకులను దూరంగా ఉంచారు.
ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక ఎస్సై, నలుగురు కానిస్టుబుళ్లు, ఇంతర సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేశాసి పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిటో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నల్గోండ జిల్లాలో రీజినల్ సెంటర్ నుంచి 96 శాతం మంది పరీక్షకు హాజరుకాగా.. అతి తక్కువగా మేడ్చల్ -5 రీజినల్ సెంటర్ నుంచి 75 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ పరీక్షకు సంబంధించి 2 లేదా 3 రోజుల్లో ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. అభ్యంతరాల తర్వాత తుది కీని ఆగస్టు 3వ వారంలో విడుదల చేసి.. ఫలితాలను సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు నియామక మండలి భావిస్తోంది. ఇక అక్టోబర్ లో పీఈటీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పీఈటీ ఫలితాలను నవంబర్ చివరలో ప్రకటించి.. వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు నిర్వహించి.. మార్చిలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు ప్రారంభించారు.
అయితే ఆగస్టు 21 న కానిస్టేబుల్ పరీక్ష ఉండటంతో.. అన్నింటికి ఒకేసారి పీఈటీ నిర్వహించనున్నారు. అక్టోబర్ చివరి నాటికి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు, రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ లాంటివి పూర్తి చేయనున్నారు. వీటి కోసం నియామక మండలి పోలీస్ క్రీడా మైదానాలు, ఇతర క్రీడా ప్రాంగణాల ఎంపికపై దృష్టి సారించింది. సుదీర్ఘ ప్రక్రియ అయిన ఈ పరీక్షలే నియామకాల్లో కీలకంగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Sub inspector, Ts constable