హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

TSLPRB SI Questions Analysis: పూర్తయిన TS SI ప్రిలిమినరీ పరీక్ష.. ప్రశ్నల స్థాయి ఎలా ఉందంటే..

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి నేడు ప్రిలిమినరీ పరీక్ష విజయవంగా పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి నేడు ప్రిలిమినరీ పరీక్ష విజయవంగా పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష హాజరయిన అభ్యర్థులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్(Bio Metric) విధానాన్ని అమలు చేశారు. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రిలిమ్స్ పరీక్షలో(Prelims Exam) ఈ సారి నెగెటివ్ విధానాన్ని(Negative) అమలు చేస్తున్నారు. అభ్యర్థులు తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోల్పోతారు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. 60 మార్కులు సాధించిన వారు ఫిజికల్ టెస్ట్ కు అనుమతించబడుతారు. ఆ టెస్ట్ లో అర్హత సాధించిన వారు తుది రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

Amazon Freedom Sale Live: వీటిపై భారీగా తగ్గింపులు.. ఎస్బీఐ కార్డు, ఈఎంఐలతో అదనపు డిస్కౌంట్స్..


ఈ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. తెలంగాణలోని పలు జిల్లాలో అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. నాగోల్ లోని శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎగ్జామ్ కు లేట్ వచ్చిన ముగ్గురిని పరీక్ష కేంద్రంలోకి వెళ్లనీయ్యలేదు. అంతే కాకుండా.. సికింద్రాబాద్ సెంట్ మెరిస్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఓ అభ్యర్ధి పాస్ ఫోటో తీసుకురానందుకు పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వలేదు. మెదక్ జిల్లా ఎగ్జామ్ సెంటర్ కు ఆలస్యంగా వచ్చిన నలుగురు అభ్యర్ధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఇటు సిద్దిపేటలో కూడా.. ఓ యువతి లేట్ గా వచ్చినందుకు అధికారులు ఆమెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.

ఇక కొంత మందికి సెంటర్ దొరక్క పరీక్ష రాయలేకపోయారు. మరికొంత మంది ట్రాఫిక్ సమస్యలతో పరీక్ష కేంద్రం వద్దకు వచ్చేసరికి టైమ్ అయిపోవడంతో.. అధికారులు వాళ్లను కూడా ఇంటికి పంపించేశారు.  ఇదిలా ఉండగా.. పరీక్ష రాసిన అభ్యర్థులు 2018లో వచ్చిన ప్రశ్నల కంటే ఈ సారి పరీక్ష పేపర్ సింపుల్ గా వచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రశ్నల స్థాయి ఇలా..

ప్రశ్నల విభాగంప్రశ్నల సరళి
జనరల్ స్టడీస్ అండ్ జీకే(GK)Easy to Moderate
మ్యాథ్స్ (Aptitude)Moderate to Difficult
రీజనింగ్ (Reasoning)Easy to Moderate


జనరల్ స్టడీస్, మ్యాథ్స్ , రీజనింగ్ లో మ్యాథ్స్ ప్రశ్నలు కాస్త కఠినంగా అనిపించినా మిగతా పార్ట్ లల్లో ప్రశ్నలు సింపుల్ గా వచ్చినట్లు పేర్కొన్నారు. నెగెటివ్ విధానం ఈ సారి అమలులో ఉన్నందున అన్ని కేటగిరీ అభ్యర్థులకు అర్హత మార్కులను 60గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Sub inspector, Tslprb

ఉత్తమ కథలు